మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే మృతి

26 Nov, 2015 02:57 IST|Sakshi

టీనగర్: మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే పొన్నమ్మాళ్ మృతిపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి, పీఎంకే నేత రాందాస్, వీసీకే నేత తిరుమావళవన్, టీఎంసీ నేత వాసన్ తదితరులు సంతాపాలు ప్రకటించారు. రాహుల్ గాంధీ తన ప్రకటనలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఝాన్సీరాణి అవ్వ, సీనియర్ మహిళా నేత పొన్నమ్మాళ్ మృతి వార్త విని ఆవేదన చెందానని, ఆమె ఎడబాటుతో బాధపడుతున్న ఝాన్సీరాణి కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలుపుకుంటున్నానన్నారు.
 
 ఆమె మృతి రాష్ట్ర కాంగ్రెస్‌కు తీరని లోటని పేర్కొన్నారు. ఆమె తన జీవితాంతం పార్టీ అభివృద్ధికి, రాష్ట్ర ప్రజల పురోగతికి కృషి చేశారని తెలిపారు. వీసీకే నేత తిరుమావళవన్ తన ప్రకటనలో నిలకోట్టై, చోళవందాన్ నియోజకవర్గాలలో రాష్ట్ర అసెంబ్లీకి ఏడు సార్లు ఎన్నికయ్యారన్నారు. తాత్కాలిక స్పీకర్‌గాను సేవలందించారన్నారు. ఇదేవిధంగా పలువురు నేతలు తమ సంతాపాలు ప్రకటించారు.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు