‘దక్షిణ తెలంగాణ తీవ్రంగా నష్టపోతుంది’

9 May, 2017 16:44 IST|Sakshi
‘దక్షిణ తెలంగాణ తీవ్రంగా నష్టపోతుంది’
హైదరాబాద్‌: ప్రభుత్వ తీరు వల్ల సాగునీటి ప్రాజక్టుల్లో దక్షిణ తెలంగాణ తీవ్రంగా నష్టపోనుందని కల్వకుర్తి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వంశీచంద్‌ రెడ్డి అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ.. డిండి వల్ల నల్గొండ, పాలమూరు జిల్లాల మద్య గొడవ  జరగవచ్చునని అధికార పార్టీ ఎమ్మేల్యేలు అంటున్నారని తెలిపారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల చేతగాని తనం వల్లే.. ప్రాజెక్టుల్లో దక్షిణ తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్నారు. డిండి, పాలమూరు ఒకే సోర్స్ ద్వారా నిర్మిస్తే దక్షిణ తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోతారని వెల్లడించారు. వచ్చే ఏడాది నాటికి, కల్వకుర్తికి నీరు ఇవ్వకపోతే యుద్దం చేస్తామని హెచ్చరించారు.
మరిన్ని వార్తలు