సిద్ధుపై స్వపక్షం గరం గరం

24 Nov, 2016 03:44 IST|Sakshi
సిద్ధుపై స్వపక్షం గరం గరం
సాక్షి, బెంగళూరు:  కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం (సీఎల్పీ) వాడివేడిగా సాగింది. స్వపక్ష నాయకులు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారిని సమాధాన పరచడానికి సీఎం సిద్ధు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని సమాచారం. శీతాకాల సమావేశల సందర్భంగా ఉభయ సభల్లో అనుసరించాల్సిన విధివిధానాలపై చర్చించడానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన బెళగావిలో బుధవారం సీఎల్పీ సమావేశం జరిగింది. ఇందులో మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... సమావేశం ప్రారంభమైన వెంటనే రాష్ట్రంలో కరువు నిర్వహణ పనులు సరిగా సాగడం లేదని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
  ఈ విషయమై రూపొందించిన నియమ నిబంధనలు కాగితాలకే పరిమితమయ్యాయని పేర్కొన్నారు. ట్యాంకర్ల ద్వారా కనీసం తాగునీటి సరఫరా సాగడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలని సిద్ధరామయ్య దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో ఎన్ని గోశాలలు, పశుగ్రాసం బ్యాంకులు ఏర్పాటు చేశారన్న విషయంపై ప్రభుత్వ అధికారుల వద్దే సమాధానం లేదన్నారు. ఇక చెరువుల్లో పూడిక తీతకు ఇది సరైన సమయమని అరుుతే ఇన్‌ఛార్జ్ మంత్రుల నిర్లక్ష్య వైఖరి వల్ల ఆ పనులు చాలా చోట్ల ప్రారంభం కాలేదని పేర్కొన్నారు. ఈ విషయమై సంబంధిత మంత్రుల వద్ద మాట్లాడటానికి ప్రయత్నించినా ’సమయం లేదన్న’ సమాచారం అమాత్యుల నుంచి వస్తోందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. పరిస్థితి ఇలా ఉంటే తాము నియోజకవర్గాల్లో ఎలా తిరగాలని సిద్ధరామయ్యను నేరుగా ప్రశ్నించాలరు.  
 
 రుణమాఫీ విషయమై స్పష్టత ఏదీ? 
 రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితుల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలిసి కూడా రుణమాఫీ విషయంపై తీసుకునే నిర్ణయంలో ఎందుకు జాప్యం జరుగుతోందని సీఎం సిద్ధరామయ్యను నిలదీశారు. మీరు ఒక మాట చెబుతుంటే మంత్రులు మరో మాట చెబుతున్నారంటూ సహకార శాఖ మంత్రి మహదేవ ప్రసాద్‌ను ఉద్దేశించి కొంతమంది ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. కర్ణాటకలో బలవన్మరణాలకు పాల్పడ్డ రైతుల కుటుంబాలకు అందజేసే పరిహారం విషయంలో కూడా మనం నిర్లక్ష్యంగా వ్యవహరించామని సీఎం సిద్ధరామయ్యతో స్వపక్ష నాయకులు పేర్కొన్నారు. ఈ విషయంలో కేంద్రం నుంచి కర్ణాటకకు అందిన నిధుల్లో రూ.67.90 లక్షలను ఎందుకు వెనక్కు పంపించాల్సి వచ్చిందని నిలదీశారు.
 
  ఈ విషయం తాము చెబుతున్నది కాదని కంప్ట్రోలర్ అండ్ అడిట్ జనరల్ (కాగ్) నివేదికలో ఇందుకు సంబంధించిన వివరాలు స్పష్టంగా పేర్కొందని ఆయనకు వివరించారు. దీంతో సీఎం  సిద్ధరామయ్య అక్కడే ఉన్న మంత్రుల పై కొంత గరం అయ్యారు. క్షేత్రస్థారుులో ఇన్ని ఇబ్బందులు ఉంటే ఎందుకు తన దృష్టికి తీసుకురాలేదని కనీసం మంత్రి మండలి సమావేశాల్లో కూడా ఎందుకు చర్చించలేదని కోపగించుకున్నారు. అటు పై సహచరలను శాంతపరుస్తూ...’సహకార బ్యాంకుల్లో తీసుకున్న పంట రుణాలను మాఫీ చేసే విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. అందుకోసమే నివేదిక తయారు చేస్తున్నాం. ఈ విషయంలో ఎంటుంటి అపోహలు వద్దు. ఇక కేంద్రం నుంచి పరిహారం నిధులు వెనక్కు వెళ్లడానికి సదరు పరిహారం అందించడానికి రూపొందించిన నిబంధనలే కారణం. 
 
 నిబంధలకు విరుద్ధంగా వ్యవహరించకూడదు కదా? అరుునా ఇకపై ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకుందాం. మన మధ్య పొరపొచ్చలు వద్దూ’ పలు విధాలుగా సహచరులకు నచ్చజెప్పడంతో ఎట్టకేలకు సీఎల్పీ సమావేశంలో శాంతియుత వాతావరణం ఏర్పడింది. ఇక తన్వీర్ సేఠ్‌ను నీలి చిత్రాలను చూస్తూ దొరికి పోరుున విషయానికి సంబంధించి చట్టసభల్లో విపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ప్రయత్నించవచ్చవచ్చునని సీఎల్పీ సమావేశంలో సీఎం సిద్ధు పేర్కొన్నారు. అందువల్ల అందరూ కలిసికట్టుగా ఉంటూ విపక్షాల ఆరోపణలను ఎదుర్కొనాలని ఆయన సహచరులకు దిశానిర్దేశం చేశారు.   
 
>
మరిన్ని వార్తలు