మధురస్వరా‘లాఠీ’

29 May, 2019 09:09 IST|Sakshi
వేణువులా వాయిస్తున్న కానిస్టేబుల్‌

ఓ కానిస్టేబుల్‌ కృషి  

యశవంతపుర: కొత్తగా ఆలోచిస్తేనే కొత్త అంశాలు పుట్టుకొస్తాయి. ఒక కానిస్టేబుల్‌ తన ప్లాస్టిక్‌ లాఠీనే వేణువుగా రాగాలు పలికించారు. హుబ్లీ రూరల్‌ పోలీసుస్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్‌ చంద్రకాంత్‌ హుటగి ఈ విన్యాసాన్ని ప్రదర్శించారు. ఈ వీడియోను రిజర్వ్‌ బెటాలియన్‌ ఏడిజీపీ భాస్కర్‌రావ్‌ ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేయడంతో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రిజర్వు విభాగం డిజీపీ చంద్రకాంత్‌ నాదం వాయిస్తున్న సమయంలో కానిస్టేబుల్‌ వెంట ఉన్నారు. చట్ట పరిరక్షణకు అవసరమైన లాఠీని నాదస్వరంలా వాయిస్తే ఒక సంగీత కళకారుడిగా పేరు తెచ్చుకున్నారు. ఎన్నికల సందర్భంగా చిక్కమగళూరుకు విధులకు కెటాయించారు. రోజు నాలుగైదు గంటల విరామంగా ఉండటంతో తన వద్దనున్న ఫైబర్‌ లాఠీకి రంధ్రాలు పెట్టి సుమధురస్వరాలను పలికించడం నేర్చుకున్నట్లు చెప్పారు.  
 

మరిన్ని వార్తలు