ఇకపై నో సిలిండర్‌

13 Jun, 2018 08:17 IST|Sakshi

నేరుగా వంటగదికే గ్యాస్‌ పైప్‌లైన్‌

వినియోగం మేరకే బిల్లు చెల్లింపు

తిరువొత్తియూరు: చెన్నైలో ఇళ్లకు పైప్‌లైన్‌ ద్వారా వంటగ్యాస్‌ సరఫరా చేసేందుకు ఆయిల్‌ సంస్థలు ఏర్పాట్లు చేస్తున్నాయి. దీనిపై ఆయిల్‌ సంస్థ నిర్వాహక అధికారులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంటి ఉపయోగానికి, హోటళ్లకు వేర్వేరు పరిమాణంలో ఉన్న సిలిండర్‌లలో వంటగ్యాస్‌ను డోర్‌ డెలివరీ చేస్తున్నారు.  తమిళనాడులో కోటిమందికి పైగా వినియోగదారులు ఉన్నారు. రాష్ట్రంలో ఎన్నూరులో సహజవాయువు పరిశ్రమ నిర్మాణం జరుగుతోంది. ఈ పనులు పూర్తయిన వెంటనే చెన్నైలో ఇళ్లకు పైప్‌లైన్‌ ఏర్పాటుచేసి వంటగ్యాస్‌ సరఫరా చేసేందుకు పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఇళ్లకు ప్రత్యేకంగా మీటర్లు బిగించి వంటగ్యాస్‌ వినియోగించిన మేరకు నగదు వసూలు చేయనున్నట్టు తెలిపారు. దీని ద్వారా సిలిండర్లకు బుకింగ్‌ చేయడం, ఆలస్యం వంటి సమస్యలు ఉండవన్నారు.

మరిన్ని వార్తలు