వంట మాస్టర్‌కు కరోనా.. క్వారంటైన్‌కు పెళ్లి బృందం

23 Jun, 2020 07:09 IST|Sakshi
హెరూరి గ్రామంలో పర్యటిస్తున్న అధికారులు, పోలీసులు

సాక్షి, తుమకూరు: పెళ్లిలో వంట చేసిన వంట మాస్టర్‌కు కరోనా పాజిటివ్‌ రావడంతో పెళ్లి జంటతో పాటు కుటుంబ సభ్యులు, పెళ్లికి వచ్చిన వారిని క్వారంటైన్‌కు తరలించిన ఘటన జిల్లాలోని గుబ్బి తాలూకాలోని హెరూరిలో జరిగింది. వివరాలు... కొద్ది రోజుల క్రితం పెళ్లి కుమారుడు ఇంటి వద్దనే నిరాడంబరంగా వివాహం జరిగింది. పెళ్లికి వంట చేయడానికి వచ్చిన వంట మాస్టర్‌ (55)కు ఈనెల 14న జ్వరం రావడంతో పరీక్షలు చేసుకోగా కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వధూవరులతో పాటు పెళ్లికి వచ్చిన 56 మందిని క్వారంటైన్‌కు తరలించారు. ఆ ప్రాంతం మొత్తం సీల్‌డౌన్‌ చేసి రసాయనాలు స్ప్రే చేశారు. చదవండి: భారత్‌లో కరోనా వ్యాప్తి తక్కువే 


సీల్‌డౌన్‌ దృశ్యం

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు