అవినీతికి ‘ఉపాధి’

27 Aug, 2015 01:41 IST|Sakshi
అవినీతికి ‘ఉపాధి’

బెంగళూరు:గ్రామీణ కూలీల వలసలను నియంత్రించేందుకు రాష్ట్రంలో చేపట్టిన మహాత్మాగాంధీ గ్రా మీణ ఉపాధి హామీ పథకం అక్రమార్కులకు వరంగా మారింది. రాష్ట్రంలోని 30 జిల్లాలో ప్రవేశపెట్టిన ఈ పథకం కింద పనులు కల్పించాలంటూ 29.75 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 21.26 లక్షల పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో నుంచి 18.80 లక్షల మందికి మాత్రమే జాబ్‌కార్డులు మంజూ రు చేశారు. జాబ్‌కార్డులో పొందిన వారిలో 16.28 లక్ష ల మంది బ్యాంక్ ఖాతాలను ప్రారంభించారు. మరో 2.12 లక్షల మంది తపాలా కార్యాలయాల్లో ఖాతాలు ఏర్పా టు చేసుకున్నారు.

ఇదే విషయాన్ని రాష్ట్ర గ్రామీణాభి వృద్ధి శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇక్కడే అసలు తిరకాసు ఉన్నట్లు థర్డ్‌పార్టీ విచారణలో వెలుగు చూసిం ది. జాబ్‌కార్డుల వితరణ, బ్యాంక్ ఖాతాల్లో 35.34 శా తం నకిలీవని స్పష్టంగా తేలింది. దీంతో 2012 నుంచి మూడేళ్లలో ఉపాధి హామీ పథకం కింద మంజూరైన ని ధుల్లో రూ.1,870 కోట్లు స్వాహా అయినట్లు లెక్కలు తే లాయి. వెనుకబడిన ప్రాంతంగా గుర్తింపు పొందిన హై దరాబాద్-కర్ణాటక (హై-క) ప్రాంతంలోని బీదర్, యా దగిరి, రాయచూరు, కొప్పల్, బళ్లారి, గుల్బార్గాలతో పాటు చామరాజనగర, చిత్రదుర్గ జిల్లాలో అక్రమాలు ఎక్కువ గా చోటు చేసుకున్నట్లు ఆడిటింగ్ కమి టీ సభ్యులు గుర్తించారు. కొన్ని గ్రామ పంచాయతీల్లో ఎలాంటి పనులు చేయకుండానే స్థానికం గా ఉన్న కొందరు రాజకీయ నాయకులు నకిలీ జాబ్‌కార్డులతో నిధులు స్వాహా చేసినట్లు పరిశీలనంలో తేలింది.

 ఆధార్‌తో తిప్పలు
 రాష్ట్రంలో ఆధార్ కార్డు ఉన్నవారికి మాత్రమే గత ఏడా ది కాలంగా ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పిస్తున్నారు. దీంతో ఆధార్ కార్డులేని వారు తమ పేర్లను నమోదు చేసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ముఖ్యంగా రాష్ట్రంలో శివమొగ్గా, దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ జిల్లాల్లో మాత్రం 50 శాతం ఆధార్ ప్రక్రియ పూర్తయింది. మిగిలిన జిల్లాల్లో ఆధార్ వితరణ 30 శాతానికి మించలేదు. ఇలాంటి తరుణంలో ఉపాధి హామీ పథకానికి పేర్లను నమోదు చేసుకున్నవారికి ఆధార్ కచ్చితం చేయడం సరికాదని లబ్ధిదారులు వాపోతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై అనేక విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా కరువు నెలకొంది.  మొత్తం 114 తాలూకాల్లో వర్షాభావంతో రైతులతో పాటు వ్యవసాయ కూలీలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  ఈ సమయంలో ఉపాధి పనులకు ఆధార్ తప్పనిసరి అని చేయడం వల్ల చాలా మందికి పనులు లభించని పరిస్థితి ఉత్పన్నమవుతోంది. దీంతో బతుకు తెరువు కోసం నగర, పట్టణాలకు వలసలు పెరుగుతున్నాయని సామాజిక వేత్తలు పేర్కొంటున్నారు. ఇది రాష్ట్రాభివృద్ధికి మంచిది కాదని వారు హెచ్చరిస్తున్నారు.  రాష్ట్రంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు అందే వరకూ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే వారికి ‘ఆధార్’కు ప్రత్యామ్నాయాన్ని అందించే విషయమై ఆలోచించాలని ప్రభుత్వానికి సామాజిక వేత్తలు  సూచిస్తున్నారు.
 
 

>
మరిన్ని వార్తలు