8 మందితోనే పెళ్లి తంతు పూర్తి..

23 Mar, 2020 10:12 IST|Sakshi
వధూవరులు శరత్, రేవతి

కర్ణాటక, హోసూరు: పెళ్లంటే ఆనందోత్సాహాల సందడి మిన్నంటాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సందడి పోతేపోయింది, పెళ్లి జరిగిపోతే చాలు అన్నట్లుగా ఉంది. జిల్లా కేంద్రం క్రిష్ణగిరిలో లక్షల ఖర్చుతో పెళ్లి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వెయ్యి మందికి వంటలు వండి ఆఖరుకు 8 మందితోనే పెళ్లి తంతు పూర్తయింది. బెంగళూరుకు చెందిన శరత్, క్రిష్ణగిరి సమీపంలోని మణియాండహళ్లి గ్రామానికి చెందిన రేవతితో ఆదివారం పెళ్లి ముహూర్తం నిర్ణయించారు. క్రిష్ణగిరిలో కళ్యాణమంటపం, పురోహితులు, వంట మనుషులతో పాటు పెళ్లి ఏర్పాట్లు పూర్తి చేశారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఆదివారమే జనతా కర్ఫ్యూ విధించడం, వాహనాల రాకపోకలు స్తంభించడంతో అతిథులెవ్వరూ రాలేదు. ఆఖరికి అటు, ఇటు కుటుంబ సభ్యులే పెళ్లిని జరిపించారు. వేల మందికి పైగా వండిన వంటలు, ఇతర ఏర్పాట్లు వృథా అయ్యాయి.  (‘‘మమ’’ అనిపించారు)

బోసిపోయిన కళ్యాణమంటపం

>
మరిన్ని వార్తలు