అనంతపురం ఐసీఐసీఐ బ్యాంకు వద్ద ఉద్రిక్తత

22 Dec, 2016 14:35 IST|Sakshi
అనంతపురం: అనంతపురం ఐసీఐసీఐ బ్యాంకు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బ్యాంకు ముందు నో క్యాష్ బోర్డు పెట్టడంతో ఆగ్రహం చెందిన సీపీఐ కార్యకర్తలు బ్యాంకుపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సీసీ కెమెరాలు, బ్యాంకు బోర్డు ధ్వంసం చేశారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు. పోలీసులు, సీపీఐ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. పలువురు సీపీఐ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 
మరోవైపు విజయవాడ నగరంలోని ఆంధ్రాబ్యాంకు జోనల్ ఆఫీసు ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ వారు ఈ ప్రదర్శనకు దిగారు. పెద్ద నోట్ల రద్దు వల్ల సామాన్య ప్రజలు రోడ్డున పడ్డారని పార్టీ నాయకులు విమర్శించారు. పెద్ద నోట్ల రద్దుపై మోదీ తీసుకున్న నిర్ణయాన్ని తుగ్లక్ చర్యగా నాయకులు అభివర్ణించారు.
మరిన్ని వార్తలు