కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సీపీఐ ఫైర్

25 Aug, 2016 14:43 IST|Sakshi
పాల్వంచ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సీపీఐ సీనియర్ నేత చాడ వెంకట్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఖమ్మం జిల్లా పాల్వంచలో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వాలు దళితులను చిన్నచూపు చూస్తున్నాయన్నారు. చర్మకారులు కూడా ధర్నాలు చేయాల్సిన పరిస్థితి దేశంలో ఉన్నదన్నారు. విదేశీ పెట్టుబడులు దేశాన్ని కుదేలు చేస్తున్నాయన్నారు. సెప్టెంబర్ 2న దేశవ్యాప్త సమ్మె జరగనుందన్నారు. బ్యాంకుల విలీనం, రైతులపై, కార్మికులపై , మైనారిటీలపై దాడులను సీపీఐ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రచారం తప్ప కార్యరూపం దాల్చే ఏ ఒక్క మంచి పని చేయటంలేదన్నారు. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అని ఆనాడు అన్న నినాదం.. నేడు ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జిల్లాల పునిర్విభజన విషయంలో కేసీఆర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
>
మరిన్ని వార్తలు