సాంఘిక సంక్షేమానికి కోత

14 Mar, 2015 00:38 IST|Sakshi

బెంగళూరు:గత ఏడాది బడ్జెట్‌తో పోలిస్తే ఈ ఏడాది సాంఘిక సంక్షేమ శాఖకు నిధుల కేటాయింపులో భారీగానే కోతపడింది. గతఏడాది బడ్జెట్‌లో రూ.6,475 కోట్లు కేటాయించగా ఈ బడ్జెట్‌లో రూ.4,584 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే మొత్తంగా సాంఘిక సంక్షేమ శాఖకు రూ.1,891 కోట్లు తగ్గించారు.ఎస్సీ, ఎస్టీలకు గ్రామీణ ప్రాంతాల్లో యూనిట్‌కు రూ.1.5లక్షల వ్యయంతో లక్ష ఇళ్ల నిర్మాణం, పట్టణ ప్రాంతాల్లో యూనిట్‌కు రూ.1.8లక్షల వ్యయంతో 50వేల ఇళ్ల నిర్మాణం

అస్పృశ్యతా నివారణ దిశగా ఇతర వర్ణాలకు చెందిన అమ్మాయిని వివాహం చేసుకునే అబ్బాయిలకు ఇచ్చే ప్రోత్సాహకం రూ.50వేల నుంచి రూ. 2లక్షలకు పెంపు, ఇతర వర్ణాలకు చెందిన అబ్బాయిని వివాహం చేసుకునే అమ్మాయిలకు ఇచ్చే ప్రోత్సాహకం లక్ష రూపాయల నుంచి రూ.3లక్షలకు పెంపుప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల భోజనం ఖర్చులు రూ.800 నుంచి రూ.900కు పెంపు(నెలవారీగా)  సొంత భవనం కలిగిన అన్ని ప్రభుత్వ కళాశాలల వసతి గృహాల్లో కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్స్‌ను ఏర్పాటు చేయడంతో పాటు ఈ-లర్నింగ్ సదుపాయం సైతం అందుబాటులోకి  ఏడాదికి ఆరు లక్షల కన్నా తక్కువ ఆదాయం ఉన్న ఎస్సీ,ఎస్టీల పిల్లలకు 100శాతం ఫీజు రీఎంబర్స్‌మెంట్.

మరిన్ని వార్తలు