వేగంగా కదులుతున్న 'నాడా' తుపాను

12 Dec, 2016 15:12 IST|Sakshi
వేగంగా కదులుతున్న 'నాడా' తుపాను

చెన్నై : తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్రలో నాడా తుపాను తీవ్ర ప్రభావం చూపనుందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో తమిళనాడు తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని చెప్పింది. గంటకు 45-50 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. 

తుపాను చెన్నైకు ఆగ్నేయంగా 710కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని ప్రస్తుతం తుపాను వేగంగా కదులుతుందని కడలూరు వద్ద శుక్రవారం తీరం దాటే అవకాశముందని చెప్పింది. నాగపట్నం, కడలూరు, కారైకల్ ఓడరేవుల్లో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు హెచ్చరించారు. ముందస్తుగా తమిళనాడులోని ఐదు జిల్లాల్లో పాఠశాలకు రెండో రోజులు సెలవులు ప్రకటించారు. నెల్లూరు జిల్లాలో నాడా తుపాను ప్రభావం చూపే అవకాశముందని తెలిపింది.

మరిన్ని వార్తలు