యూనిఫాంలో చిందేసి.. సస్పెండ్ అయ్యాడు

11 Feb, 2016 15:38 IST|Sakshi
యూనిఫాంలో చిందేసి.. సస్పెండ్ అయ్యాడు

విధుల్లో ఉన్న ఓ పోలీస్ అధికారి.. అందులోనూ యానిఫాం ధరించి డాన్స్ చేశారు. ఈ వీడియోను ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో దుమారం చెలరేగింది. ఉన్నతాధికారులు సంబంధిత అధికారిపై సస్పెన్షన్ వేటు వేశారు.

తమిళనాడులోని సేలం జిల్లాలో అత్తూరు సబ్ జైలు డిప్యూటీ జైలర్ శంకరన్ (58) గత నెలలో రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనేందుకు చెన్నై వెళ్లారు. రిపబ్లిక్ వేడుకల సందర్భంగా యూనిఫాం ధరించి ఆయన డాన్స్ చేస్తుండగా, తోటి అధికారులు ప్రోత్సహిస్తూ తమ మొబైల్ ఫోన్లతో వీడియో తీశారు. ఈ వీడియోను ఫోస్బుక్లో పోస్ట్ చేయడంతో పాటు వాట్సప్లో షేర్ చేసుకున్నారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో శంకరన్ను కోయంబత్తూరుకు బదిలీ చేసి, విచారణకు ఆదేశించారు. సేలం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ షణ్ముగ సుందరం విచారణ చేసి నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా శంకరన్పై చర్యలు తీసుకున్నారు.

మరిన్ని వార్తలు