డానిష్ మహిళపై అత్యాచారం కేసులో నిందితుల కస్టడీ పొడగింపు

21 Jan, 2014 02:48 IST|Sakshi

న్యూఢిల్లీ: డానిష్ పర్యాటకురాలిపై అత్యాచారం కేసులో అరెస్టయిన ఐదుగురిని ఈ నెల 23 వరకు పోలీసు కస్టడీకి తరలిస్తూ స్థానిక కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. నిందితులు మహేందర్ ఎలియాస్ గాంజా, మహ్మద్ రజా, రాజుసింగ్, అర్జున్, రాజుకు విధించిన రిమాండ్ ముగిసిపోవడంతో వారిని పోలీసు కస్టడీకి అప్పగిస్తూ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సుధాంశు కౌషిక్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో మరో ఇద్దరు మైనర్లను అరెస్టు చేశామని, మరొకరు పరారీలో ఉన్నారని పోలీసులు న్యాయమూర్తికి తెలిపారు. చిల్లర నేరాలు చేసే వీరంతా ఈ నెల 14న బాధితురాలిని కత్తితో బెదిరించి అత్యాచారం చేశారని తెలిపారు. అనంతరం ఆమె దగ్గరున్న వస్తువులు, డబ్బు కూడా దోచుకున్నారని వెల్లడించారు. 

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు