కనకదుర్గ దేవస్థానంలో ముగిసిన దసరా ఉత్సవాలు

11 Oct, 2016 12:20 IST|Sakshi

విజయవాడ : బెజవాడ కనకదుర్గ దేవస్థానంలో దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు మంగళవారం ముగిశాయి. ఆలయ పండితులు యజ్ఞ నారాయణశర్మ, శివప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఎ. సూర్యకుమారితోపాటు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. 11 రోజులపాటు అత్యంత వైభవంగా దసరా మహోత్సవాలు జరిగాయి. సాయంత్రం గంగా సమేత దుర్గా మల్లేశ్వరస్వామివార్ల తెప్పోత్సవం హంసవాహనంపై కృష్ణానదిలో జరగనుంది.

మరిన్ని వార్తలు