ప్రతీకారం తీర్చుకుంటాం

15 Dec, 2014 04:25 IST|Sakshi
ప్రతీకారం తీర్చుకుంటాం

డీసీసీ అభిషేక్ గోయల్‌కు  ఐఎస్‌ఐఎస్ ప్రతీకార ట్వీట్
సాక్షి,బెంగళూరు: తమ సహోదరుడు మహ్దీ అరెస్టుకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్‌ఐఎస్) ఉగ్రవాదులు ట్వీట్ చేశారు.! మహ్దీ అరెస్టులో కీలక పాత్ర వహించిన డీసీపీ గోయల్ ట్విట్‌కు సమాధానంగా ఈ ప్రతీకార ట్వీట్ వచ్చింది. ఐఎస్‌ఐఎస్‌లో యువకులను చేర్పించడమే లక్ష్యంగా బెంగళూరు నుంచి ‘షమి విట్‌నెస్’ పేరుతో మహ్దీ ట్విటర్ నిర్వహిస్తున్న విషయం పసిగట్టిన నిఘా వర్గాలు ఆయన్ను శనివారం తెల్లవారుజామున బెంగళూరులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

ఈ ‘ఆపరేషన్’లో కీలక పాత్ర వహించిన డీసీపీ అభిషేక్‌గోయల్ అదేరోజు మధ్యాహ్నం తన ట్విట్టర్ అకౌంట్‌లో సంఘటన పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఇందుకు అదేరోజు రాత్రి 11:30 గంటలలోపు దాదాపు దాదాపు 500 ప్రతిస్పందనలు వచ్చాయి. ఇందులో జ్చిఛ్ఛీః్చఛౌఠ్చజ్చ16 నుంచి ‘మా సోదరుడిని (మహ్దీ) మీ చేతుల్లో విడిచిపెట్టం. ప్రతీకారం తీర్చుకుంటాం. వేచి చూడండి’ (వియ్ విల్ నాట్ లీవ్ అవర్ బ్రదర్ ఇన్ యువర్ హ్యాండ్. రివైజ్ ఈజ్ కమింగ్. వెయిట్ ఫర్ అవర్ రియాక్షన్) అని ట్వీట్ చేశారు.

ఈ విషయాన్ని డీసీపీ గోయల్ ధృవీకరించారు. అంతేకాకుండా ఘటనకు సంబంధించి ఇప్పటికే ఉన్నతాధికారులకు తెలియజేశారు. ప్రస్తుతం ఈ ట్విట్ ఎక్కడి నుంచి వచ్చింది. ఎవరు చేశారు అన్న దిశగా కూడా దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు కోర్టు అనుమతితో ఐదురోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు మహ్దీను రహస్య స్థలంలో విచారణ చేస్తున్నారు.

ఆపరేషన్‌లో భాగం పంచుకున్న పోలీసు అధికారికి బెదిరింపులు రావడంతో పాటు ఇతని ట్విటర్ ఫాలొయర్స్ ఎక్కువగా బ్రిటన్‌కు చెందిన వారు కావడంతో అక్కడి పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి న్యాయస్థానం అనుమతితో మహ్దీని విచారించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

మరిన్ని వార్తలు