డీడీఏ గృహ పథకం రేపటి నుంచి ఫారాలు అందుబాటులో

30 Aug, 2014 22:58 IST|Sakshi

 సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) హౌసింగ్ పథకం- 2014 సోమవారం నుంచి ఆరం భం కానుంది. ఇందుకు సంబంధించి సంబంధిత అధికారులు అన్ని ఏర్పా ట్లు పూర్తి చేశారు. సోమవారం ఉద యం తొమ్మిదిన్నర గం టలకు వికాస్ సదన్‌లోని నాగరిక్ సువి ధా సెంటర్‌లో డీడీఏ ఉపాధ్యక్షుడు బల్వీందర్ కుమార్ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆసక్తి కలిగినవారికి దరఖాస్తు ఫారాలను బ్యాంకుల ద్వా రా అందజేయడానికి డీడీఏ అన్ని ఏర్పాట్లు చేసింది. తొలి దశలో 15 లక్షల బ్రోచర్లు ముద్రిస్తున్నారు. వీటి ఖరీదును రూ. 150గా నిర్ణయించారు.
 
 బ్రోచర్లు సరళంగా ఉంటాయని, దరఖాస్తు ఫారాల పూర్తి ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నామని సంబంధిత అధికారులు తెలిపారు. బ్రోచర్లు 13 బ్యాంకుల అన్ని శాఖలలో లభిస్తాయి. పూర్తిచేసినదరఖాస్తు ఫారాలను కూడా బ్యాంకులకు సమర్పించాల్సి ఉం టుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్, సిండికేట్, కార్పొరేషన్, యూనియన్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఐడీబీఐ, ఇండస్‌ఇండ్, కోటక్ మహీ ంద్రా, యస్, యాక్సిస్ తదితర బ్యాంకులు దరఖాస్తు ఫారాలను అందజేేయడంతో పాటు
 
  రిజిస్ట్రేషన్ సొమ్మును చెల్లించడం కోసం తమ తమ శాఖలలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తారు. డీడీఏ కోరిన రిజిస్ట్రేషన్ సొమ్మును దరఖాస్తుదారులకు రుణం రూపంలో అందజేయడానికి  బ్యాం కులు పలు పథకాలను రూపొందించాయి. 2014 హౌసింగ్ పథకంకింద డిడిఏ నగరంలో 25 వేలకు పైగా ఫ్లాట్లను కేటాయించనుంది. దరఖాస్తు పత్రాలు వచ్చే నెల ఒకటో తేదీనుంచి అక్టోబర్ తొమ్మిది వరకు లభిస్తాయి. అక్టోబర్ నెలాఖరులో ఇందుకు సంబ ంధించి డ్రా తీయనున్నారు.  
 

మరిన్ని వార్తలు