గ్యాంగ్‌రేప్ కేసులో 30 ఏళ్ల జైలుశిక్ష

2 Apr, 2014 08:32 IST|Sakshi
 న్యూఢిల్లీ: ఓ మహిళను అక్రమంగా తొమ్మిది నెలల పాటు నిర్బంధించడంతో పాటు ఆమెపై తన ఇద్దరు సహచరులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి నగర కోర్టు 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన శివను గ్యాంగ్‌రేప్, రేప్, అక్రమ నిర్బంధం, బెదిరింపులకు పాల్పడటం వంటి నేరాల కింద దోషిగా ఖరారు చేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. అత్యాచారం, అక్రమ నిర్బంధం, బెదిరింపుల నేరాలకుగాను తొలుత పదేళ్ల జైలు శిక్ష అనుభవించాలని, సామూహిక అత్యాచారానికి పాల్పడినందుకు గాను 20 ఏళ్ల కారాగారశిక్ష ప్రారంభమవుతుందని కోర్టు పేర్కొంది.
 
నిందితుడు శివ తరచుగా బాధితురాలిని కొట్టేవాడని, చంపుతానని బెదిరించేవాడని ప్రాసిక్యూషన్ పేర్కొంది. కాగా ఆమెపై నేరం జరిగిందనడానికి  సాక్ష్యాధారాలు లభించలేదని అదనపు సెష న్స్ జడ్జీ వీరేందర్ భట్ పేర్కొన్నారు. అలాగే తనను కిడ్నాప్ చేశారన్న బాధితురాలి వాదనను కూడా కోర్టు కొట్టివేసింది. 30 ఏళ్ల మహిళను అందరూ చూస్తుండగా ఓ రైలు నుంచి అపహరించడం సాధ్యం కాదన్నారు. శివకు కోర్టు రూ.50వేల జరిమానా కూడా విధించింది. బాధితురాలిని శివ గత ఏడాది మార్చి 22 నుంచి నిర్బంధించినట్లు ప్రాసిక్యూషన్ నిరూపించింది. 
 
మరిన్ని వార్తలు