మెవాటి గ్యాంగ్‌కు జైలు శిక్ష

11 Oct, 2014 22:40 IST|Sakshi

న్యూఢిల్లీ: జాతీయ సంపద పరిరక్షణకు ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని ఢీల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.  అక్రమంగా పశువులను తరలిస్తూ పోలీసుపై కాల్పులకు పాల్పడిన ఏడుగురు సభ్యులు గల మెవాటి గ్యాంగ్‌కు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. గోవులు జాతీయ సంపద అని, వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉన్నదని అడిషనల్ సెషన్స్ జడ్జి కామిని లాహు తీర్పు సందర్భంగా సూచించారు.18-19, 2013లో ఢిల్లీ శివారులో అక్రమంగా గోవులను తరలిస్తున్న మెవాటి గ్యాంగ్‌ను పోలీసులు అడ్డుకొన్నారు. ఈ క్రమంలో మెవాటీలు, పోలీసులకు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ కేసులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన అన్వర్, అంకుర్‌కుమార్, సాన్వర్, ఖలీద్, తస్లీం, హసరాత్, అసీఫ్ అనే మెవాటిగ్యాంగ్‌కు చెందిన వారిని నిందితులుగా గుర్తించి అరెస్టు చేశారు. డ్యూటీలో ఉన్న పోలీసును చంపినందుకు ఐపీసీలోని పలు సెక్షన్లతోపాటు, ఢిల్లీ అగ్రికల్చర్ క్యాటిల్ ప్రిజర్వేషన్ యాక్టు కింద నిందితులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. డ్యూటీలో ఉన్న పోలీసును హత్య చేసినట్లు విచారణలో రుజువు అయ్యింది. ఈ మేరకు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.
 

మరిన్ని వార్తలు