కరెంట్ తీసేస్తాం!

4 Feb, 2014 23:23 IST|Sakshi
బీఎస్‌ఈఎస్ రాజధాని పవర్ లిమిటెడ్, బీఎస్‌ఈఎస్ యమునా పవర్ లిమిటెడ్ సకాలంలో బకాయిలు చెల్లించనట్లయితే కరెంటు సరఫరా నిలిపి వేస్తామని ఎన్టీపీసీ తాజాగా హెచ్చరించడంతో ఈ నెల 11 నుంచి భారీగా కరెంటు కోతలు తప్పకపోవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 
 
సాక్షి, న్యూఢిల్లీ: రిలయన్స్ గ్రూపునకు చెందిన  విద్యుత్ కంపెనీలు (డిస్కమ్‌లు) బీఎస్‌ఈఎస్ రాజధాని పవర్ లిమిటెడ్, బీఎస్‌ఈఎస్ యమునా పవర్ లిమిటెడ్ సకాలంలో బకాయిలు చెల్లించనట్లయితే కరెంటు సరఫరా నిలిపి వేయకతప్పదని జాతీయ బొగ్గు విద్యుత్ ఉత్పత్తి సంస్థ (ఎన్టీపీసీ) హెచ్చరించింది. ఫిబ్రవరి 11లోగా బకాయిలు చెల్లించాలని ఎన్టీపీసీ ఈ రెండు డిస్కమ్‌లకు శనివారం నోటీసులు జారీ చేసింది. తమ సంస్థ తీవ్ర ఆర్థిక ఇబ్బందులో ఉందని, డిస్కమ్‌లు బకాయిలు చెల్లించకుంటే రెండువేల మెగావాట్ల విద్యుత్ సరఫరా నిలిపివేయవలసి వస్తుందని, దానిని కొనడానికి ఇతరులు సిద్ధంగా  ఎన్టీపీసీ  చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ అరూప్‌రాయ్ చౌదరి మంగళవారం స్పష్టం చేశారు. 
 
 దీనిపై స్పందించాల్సిందిగా విద్యుత్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను విలేకరులు కోరగా, ఇది ఢిల్లీ డిస్కమ్‌లు, డీఈఆర్ సీ, ఢిల్లీ ప్రభుత్వాల మధ్య సమస్య కాబట్టి, తాము మాట్లాడవలసింది ఏమీ లేదని అన్నారు. అయితే ఎన్టీపీసీకి చెల్లించవలసిన బకాయిలను డిస్కమ్‌లు వీలైనంత త్వరగా చెల్లిస్తాయని తాము ఆశిస్తున్నామని సింధియా చెప్పారు. బీఎస్‌ఈఎస్ గతంలో కూడా చెల్లింపుల విషయంలో సమస్య సృష్టించిందని అరూప్‌రాయ్ చౌదరి చెప్పారు. బీఎస్‌ఈఎస్‌కు ఇది మొదటి నోటీసు కాదని, ఈ డిస్కమ్‌తో సమస్యలు రావడం ఇది మూడోసారని ఆయన చెప్పారు. ఆ కంపెనీ ఎప్పుడూ సకాలంలో చెల్లింపులు జరపడం లేదని, ఈసారి బకాయిలు కూడా చెల్లించలేదని చౌదరి చెప్పారు. డిసెంబర్‌లో వాడుకున్న విద్యుత్‌కు బీఎస్‌ఈఎస్ చెల్లింపులు జరపవలసి ఉంది. ఢిల్లీలోని మరో డిస్కమ్ టాటాపవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ చెల్లింపుల విషయంలో తమకు ఎన్నడూ సమస్య సృష్టించలేదని ఆయన చెప్పారు. ఆ కంపెనీ సకాలంలో బిల్లులు చెలిస్తుందని ఆయన చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా తమకు ఢిల్లీ ప్రభుత్వంతో ‘థర్డ్ పార్టీ అగ్రిమెంట్’ లేదని అరూప్‌రాయ్ చౌదరి చెప్పారు. బీఆర్‌పీఎల్ రాజధాని
 
మరిన్ని వార్తలు