ఫామ్‌హౌస్‌లో చీకటి దందాకు పోలీసుల తెర

23 Aug, 2017 12:31 IST|Sakshi
సినిమా సెట్‌ అనుకుంటే....తీరా..

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో తరచూ సినిమా, టీవీ షూటింగ్‌లు జరిగే సువిశాల ఫామ్‌హౌస్‌లో సాగుతున్న చీకటి దందాకు పోలీసులు తెర దించారు. గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న క్యాసినో బాగోతాన్ని రట్టు చేశారు. పోలీసుల దాడిలో 30 మంది అరెస్ట్‌ అయ్యారు. దేరామండి రోడ్డులోని 13 ఎకరాల లగ్జరీ ఫామ్‌హౌస్‌ నుంచి  13 విలాసవతంమైన కార్లను స్వాధీనం చేసుకున్నారు. జూదం ఆడుతున్న 14 మందిని అదుపులోకి తీసుకున్నామని, క్యాసినో..బార్‌లో సేవలందిస్తున్న ఐదుగురు మహిళలనూ అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.

లిక్కర్‌ బాటిల్స్‌, క్యాసినో చిప్స్‌, హుక్కాలను సీజ్‌ చేశామని వెల్లడించారు. గత ఏడాది అక్టోబర్‌లో దక్షిణ ఢిల్లీలోని వసంత్‌ కుంజ్‌ ప్రాంతంలో అక్రమంగా నిర్వహిస్తున్న క్యాసినోపై పోలీసుల దాడిలో ఎనిమిది మంది అరెస్ట్‌ అయ్యారు. కోట్లాది రూపాయల విలువైన దాదాపు 3000 గ్యాంబ్లింగ్‌ చిప్‌లను స్వాధీనం చేసుకున్నారు. భారత్‌లో గోవా, సిక్కిం, డామన్‌ మినహా క్యాసినోలు నిర్వహించడం చట్టవిరుద్ధం.

మరిన్ని వార్తలు