ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ వీడియో వైరల్‌

10 Aug, 2017 17:27 IST|Sakshi
ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ వీడియో వైరల్‌

సాక్షి, ఢిల్లీ: అది ఢిల్లీలోని పశ్చిమ విహార్‌ ప్రాంతం. భారీ వర్షంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయి ట్రాఫిక్ జామ్‌ అయిపోయింది. కానీ, అక్కడే ఉన్న ఒకరిని మాత్రం ఆ జడివాన అస్సలు ఆపలేకపోయింది. తన విధిని సక్రమంగా నిర్వహించినందుకు ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో  హీరో అయిపోయాడు.

 వర్షం పడుతున్న సమయంలో ట్రాఫిక్‌ కంట్రోల్‌ చేసేవాళ్లు సాధారణంగా షెల్టర్‌లో కూర్చుంటారు. కానీ, ఈ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ మాత్రం తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా  డ్యూటీని నిర్వహించాడు. ఎప్పుడైనా,ఎక్కడైనా పోలీసులు తప్పుచేశారన్న వార్త తెలియగానే వారిని తిట్టుకుంటాం. కానీ, ఇలాంటి పనులు చేసిన సమయంలో అభినందించేందుకు కూడా ముందుకు రావాలి అంటూ ఆ వీడియోలను చిత్రీకరించిన మన్కన్‌ బమ్మి అనే యువకుడు కోరుతున్నాడు.

బమ్మి తన ఫేస్‌బుక్‌ ఖాతాలో ఆగస్టు 7న రెండు వీడియోలు అప్ లోడ్ చేశాడు.  ఒకదాంట్లో భారీ వర్షంలో ట్రాఫిక్‌ను కంట్రోల్‌ చేయటం, మరోదాంట్లో ఆగిపోయిన ఓ వాహనాన్ని నెడుతూ సాయం చేసినట్లు ఉంది. మొదటి వీడియోను సుమారు లక్షన్నరమంది, రెండో వీడియోను సుమారు 3 లక్షల మంది వీక్షించారు.