ఏపీలో తీవ్రమైన ఏటీఎం కష్టాలు

30 Nov, 2016 18:50 IST|Sakshi
ఏపీలో తీవ్రమైన ఏటీఎం కష్టాలు

విజయవాడ: పాత పెద్ద నోట్ల రద్దుతో ఆంధ్రప్రదేశ్‌ లో నోట్ల కష్టాలు తీవ్రమయ్యాయి. బ్యాంకులు, ఏటీఎంలలో డబ్బు లేకపోవడంతో సామాన్యులు అల్లాడుతున్నారు. పాత పెద్ద నోట్లను రద్దు చేసి 22 రోజులు అవుతున్నా 25 శాతం ఏటీఎంలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

కొత్త నోట్లకు అనుగుణంగా 2,575 ఏటీఎంలు మాత్రమే ఆధునీకరించారు. పనిచేస్తున్న ఏటీఎంలలో 2 వేల రూపాయల నోట్లు మాత్రమే లభిస్తున్నాయి. ఏ ఒక్క ఏటీఎంలోనూ 100 రూపాయల నోట్లు లభించని దుస్థితి నెలకొనడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రూ. 62 కోట్ల 100 నోట్లు మాత్రమే అందుబాటులో ఉండడంతో అవి ఏమూలకు సరిపోవడం లేదు.

జీతాల రోజు వచ్చినా ఏటీఎంలతో నగదు లభ్యం కాకపోవడంతో సామాన్య జనం దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఏపీలో 10 శాతం మాత్రమే ఆన్‌ లైన్‌ లావాదేవీలు జరిగినట్టు తెలుస్తోంది. సరైన సన్నద్ధత లేకుండా నగదు రహిత లావాదేవీలు ఎలా సాధ్యమని జనం ప్రశ్నిస్తున్నారు. రేపటి నుంచి పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని వార్తలు