డజన్ల కొద్దీ డెంగీ కేసులు

23 Sep, 2013 00:26 IST|Sakshi

ముంబై: నగరంలోని తూర్పు బాంద్రావాసుల ను డెంగీ వ్యాధి భయపెడుతోంది. ఇక్కడి ప్రభుత్వ కాలనీ పరిసర ప్రాంతాల్లో డజన్ల కొద్దీ కేసులు నమోదవుతున్నాయి. ఈ వ్యాధిబారినపడి 16 ఏళ్ల యువకుడు రెండు రోజుల క్రితం చనిపోయిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎం సీ) అధికారులు ఈ ప్రాంతంలో పర్యటించారు. తగు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారి రాజన్ నరింగ్రేకర్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో దోమల ఉత్పత్తి ఎక్కువగా ఉందన్నారు.
 
 ఈ ప్రాంతంలో అనేక ఇళ్లకు పగుళ్లు ఉన్నాయని, వర్షాకాలంలో నీరు చేరుతుండడంతో తమ తమ ఇళ్లపై స్థానికులు టార్పాలిన్ పట్టాలు కప్పారన్నారు. అవి దోమ ల ఉత్పత్తి కేంద్రాలుగా మారిపోతున్నాయన్నా రు. దీంతోపాటు గోరేగావ్ పరిసరాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. గోరేగావ్ పరిసరాల్లో ఈ వ్యాధి బారినపడి ఒకరు చనిపోయారు. అయితే తూర్పు బాంద్రా పరిసరాల్లో డెంగీ వ్యాధిపీడితుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. 20 రోజుల వ్యవధిలో 29 మంది ఈ వ్యాధి బారినపడ్డారు. శనివారం మరో ఇద్దరికి  ఈ వ్యాధి సోకినట్టు వైద్యుల పరీక్షల్లో తేలింది.

మరిన్ని వార్తలు