సత్యదేవుడి సన్నిధిలో భక్తుల ఇక్కట్లు

12 Dec, 2016 14:47 IST|Sakshi
అన్నవరం : కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని అన్నవరంలో కొలువైన రమా సత్యనారాయణ స్వామి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ పెరగడంతో.. ఆలయ పరిసర ప్రాంతాలు కిటకిట లాడుతున్నాయి. సత్యదేవుడి దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు ఆలయ సిబ్బంది తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి ఎండలో నిల్చున్నా కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్యూలైన్లలో నిల్చున్న మహిళలు, వృద్ధులు తాగు నీరు లేక తీవ్ర అవస్థలు పడుతున్న పట్టించుకునే నాధుడే కరువయ్యాడని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
మరిన్ని వార్తలు