తిరుమల.. దివ‍్య దర‍్శనం టోకెన‍్ల రద్దు

7 Jan, 2017 08:53 IST|Sakshi
తిరుమల.. దివ‍్య దర‍్శనం టోకెన‍్ల రద్దు

నేటి ఉదయం 9గంటల నుండి క్యూలైన్లలోకి అనుమతి
రేపు ధర్మదర్శనం మాత్రమే.. ప్రత్యేక దర్శనాలు రద్దు

తిరుమల: ఈ నెల 8న వైకుంఠ ఏకాదశి, 9న ద్వాదశి సందర్భంగా శ్రీవారి దర్శనం కోసం టీటీడీ పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. సామాన్య భక్తుల కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో మొత్తం 54 కంపార్ట్‌మెంట్లు సిద్దం చేశారు. అవి నిండిన తర్వాత నారాయణగిరి ఉద్యావనంలో మొత్తం 16 తాత్కాలిక కంపార్ట్‌మెంట్లు సిద్దం చేశారు. శనివారం ఉదయం 9 గంట‍్ల నుంచి భక‍్తులను క‍్యూలైన‍్లలోకి అనుమతిస్తారు. దీనివల‍్ల కాలినడకన వచ‍్చే భక‍్తులకు దివ‍్య దర‍్శనం టోకెన‍్ల జారీని శనివారం వేకువజాము నుంచి టీటీడీ రద్దుచేసింది. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆదివారం శ్రీవారి స్వర్ణరథోత్సవం నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవిసమేత మలయప్పస్వామి వారు స్వర్ణరథంపై ఆలయ పురవీధుల్లో దర్శనమివ్వనున్నారు.

సోమవారం ద్వాదశి సందర్భంగా వేకువజాము 4.30గంటల నుండి 5.30 గంటల మధ్య పుష్కరిణిలో శ్రీవారి చక్రస్నానం నిర్వహించనున్నారు. ఆది, సోమవారాల్లో ఆర్జిత సేవలు రద్దుచేశారు. ఆదివారం ప్రత‍్యేక దర‍్శనాలు రద్దుచేశారు. నిన్న (శుక్రవారం) శ్రీవారిని 62,031 మంది భక‍్తులు దర్శించుకున్నారు. 24,747 మంది తలనీలాలు సమర్పించారు. శుక్రవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.72 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు