ఈశ్వర ఉపాసన.. మానవ కర్తవ్యం

22 Aug, 2013 03:36 IST|Sakshi

కొరుక్కుపేట (చిత్తూరు), న్యూస్‌లైన్: ఈశ్వర ఉపాసన చేయడమే మానవ కర్తవ్యమని, అప్పుడే జీవించడానికి కావాల్సిన సర్వశక్తులూ లభిస్తాయని బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. ఋషి పీఠం చారిటబుల్ ట్రస్ట్, శర్వాణీ సంగీత సభ, భారతీ  సిమెంట్స్ సంయుక్త ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ఆధ్వర్యంలో మహాభారతంలో శివలీల అనే అంశంపై ఆథ్యాత్మిక ఉపన్యాస కార్యక్రమం జరుగుతోంది.

ఇందులో భాగంగా శ్రీ రామకృష్ణ మిషన్ మెట్రిక్ హైయర్ సెకండరీ స్కూల్ శ్రీ శారదా భవన్ హాల్(ఇన్‌ఫోసిస్ హాల్)లో చివరిరోజు బుధవారం ఆథ్యాత్మిక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా శివనామ స్మరణతో ప్రారంభమైన ప్రవచన కార్యక్రమంలో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ.. ద్రోణ పర్వం, సాత్విక పర్వం, సైందవ వధ, అర్జణుడి శిబిరంలో కృష్ణ పరమాత్మ వచ్చే సన్నివేశం, కృష్ణ పరమాత్మ అవతార ధర్మాన్ని వివరించటం తదితర అంశాలపై ఆథ్యాత్మిక ప్రసంగం చేశారు. సర్వలోకాలకూ అధిపతి అయిన ఈశ్వరుడి ఉపన్యాసం చేయటం ద్వారా మానవులు జీవించడానికి కావాల్సిన సర్వశక్తులూ అందుతాయన్నారు.

కొంత మంది శివుడు, విష్ణువులను పూజించకూడదని చెబుతుంటురాని, ఇది చాలా తప్పు అని చెప్పారు. ఋషులు, యోగుల ద్వారానే దివ్య విద్యలు కాపాడబడుతున్నాయని, ప్రపంచం అంతా వీరి ద్వారానే రక్షించపబడుతోందని వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లల్లో ఆథ్యాత్మిక చింతనను పెంపొందించాలని, అప్పుడే వారి జీవితానికి సార్థకతగా చేకూరుతుందని బోధించారు.

కార్యక్రమంలో ముందుగా ఉషా హరిహరన్ బృందంచే నామసంకీర్తన జరిగింది. ఆథ్యాత్మిక ప్రవచనం అనంతరం ఈ కార్యక్రమంలో తెలుగు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మకు చెన్నై టీటీడీ వేద పండితులు వేద ఆశీర్వరచనాలను అందజేసి సత్కరించారు.  కార్యక్రమంలో వ్యాఖ్యాతగా కేసరి మహోన్నత పాఠశాల మైలాపూర్ ప్రధానోపాధ్యాలు శ్రీనివాసులు వ్యవహరించారు. తెలుగు ప్రముఖులు ఉపద్రిష్ట నరసింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు