అమెరికాలో బాలీవుడ్ సినిమాలకు మంచి డిమాండ్

21 Sep, 2014 23:02 IST|Sakshi
అమెరికాలో బాలీవుడ్ సినిమాలకు మంచి డిమాండ్

బాలీవుడ్ సినిమాలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంటోందని విలక్షణ నటుడు బొమన్ ఇరానీ వ్యాఖ్యానించాడు. ఇంతవరకు భారత్ మార్కెట్‌నే నమ్ముకుని సినిమాలు తీస్తున్నామని, నిజం చెప్పాలంటే ప్రవాస భారతంలోనే బాలీవుడ్ సినిమాలకు మంచి గిరాకీ ఉందనే విషయం ఇటీవలనే పరిశ్రమ గుర్తించిందన్నాడు. త్వరలోనే విడుదల కానున్న షారూఖ్ నటించిన ‘హ్యాపీ న్యూ ఇయర్’ సినిమాలో బొమన్...కనిపించనున్నాడు. వారు (ప్రవాస భారతీయులు) ఎక్కువ మంది ఉండకపోవచ్చు కాని మన సినిమాలు చూసే వారిలో వారి వాటా ఎక్కువేనని ఆయన అభిప్రాయపడ్డాడు. అమెరికాలో భారతీయుల సంఖ్య సుమారు 28 లక్షలకు పైగానే ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని దీపావళి పండుగకు విడుదల కానున్న తమ సినిమాకు అక్కడ ప్రచారం కల్పించేందుకు ‘హ్యాపీ న్యూ ఇయర్’ టీం ఆ దేశంలో విస్తృతంగా పర్యటించాలని నిర్ణయించింది.
 
 అందులో భాగంగా శుక్రవారం హోస్టన్‌లోని టొయోటా సెంటర్‌లో కార్యక్రమాన్ని నిర్వహించింది. కాగా ఈ ప్రచార కార్యక్రమాల్లో హీరో షారూఖ్ ఖాన్, హీరోయిన్ దీపికా పదుకొణే, ఇతర ప్రధాన పాత్రధారులైన అభిషేక్ బచ్చన్, సోనూసూద్, వివాన్‌షా తదితరులు తళుక్కుమననున్నారు. అలాగే గత 25 ఏళ్లలో ఎన్నడూ స్టేజ్ షోలో కనిపించని డెరైక్టర్ ఫరాఖాన్ సైతం ఇక్కడ జరిగే స్టేజ్ షోలలో కనిపించనున్నారు. ఈ టీం న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, చికాగోతోపాటు కెనడాలోని వాంకోవర్‌లో సైతం తమ సినిమా ప్రచార కార్యక్రమాలను నిర్వహించనుంది.
 
 ‘ఈ సినిమాలో పాత్రధారులందరూ వివిధ ప్రాంతాలకు చెందిన వారు.. సోనూసూద్ పంజాబ్‌నుంచి వస్తే, అభిషేక్ ముం బైలో ఉంటాడు. కానీ అతడి కుటుంబ నేపథ్యం పూర్తిగా వైవిధ్యం.. అలాగే నేను పార్సీ కుటుంబానికి చెందినవాడిని.. ఇలా అన్ని రకాల సంస్కృతులు ఈ సినిమాలో కనిపించి ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాయి. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని నాకు నమ్మకముంది. ఇది ప్రేక్షకులను రంజింపజేస్తుందనే నమ్ముతున్నా..’ అని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, బొమ్మన్ ఇంతకుముందు మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగేరహో మున్నాభాయ్, ఖోస్లా కా ఘోస్లా, డాన్-ది ఛేజ్ బిగిన్స్ ఎగైన్ వంటి హిట్ సినిమాల్లో నటి ంచిన విషయం తెలిసిందే.
 

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కర్ణాటక అసెంబ్లీ మ.3గంటల వరకూ వాయిదా

ఒంటి నిండా బంగారంతో గుళ్లోకి వచ్చి..

భర్త ఆత్మహత్య : ముగ్గురు పెళ్లాల ఘర్షణ

కోడలికి కొత్త జీవితం

తమిళ హిజ్రాకు కీలక పదవి

ఫలించిన ట్రబుల్‌ షూటర్‌ చర్చలు

రెబల్‌ ఎమ్మెల్యే నాగరాజ్‌తో మంతనాలు

పెళ్లిళ్లను కాటేస్తున్న కుల తేడాలు

ఆ బాలుడిని పాఠశాలలో చేర్చుకోండి

కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన టిక్‌టాక్‌

నిరాడంబరంగా న్యాయవాది నందిని పెళ్లి

విద్యార్హతలు ఎక్కువగా ఉంటే ఉద్యోగాలకు అనర్హులే!

రోమియో టీచర్‌

కలెక్టర్‌కు కటకటాలు 

‘ఆ అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకుంటారు’

కర్ణాటకలో ఏం జరగబోతోంది?

రామలింగారెడ్డితో కుమారస్వామి మంతనాలు

బళ్లారి ముద్దుబిడ్డ వైఎస్సార్‌

వేలూరులో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

కుమారస్వామి రాజీనామా చేస్తారా? 

ఎమ్మెల్యేల రాజీనామాలకు ఈ నాలుగే కారణమా? 

మీరు మనుషులేనా? ఎక్కడేమి అడగాలో తెలియదా?

పాముతో వీరోచితంగా పోరాడి..

హైదరాబాద్‌ బిర్యానీ ఎంతపని చేసింది?

అసెంబ్లీలోకి నిమ్మకాయ నిషిద్ధం

మాంగల్య బలం

పరోటా గొంతులో చిక్కుకుని నవ వరుడు మృతి

వేలూరు లోక్‌సభకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వనిత కూతురు

కంచిలో విషాదం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అడ్డంకులు మాయం!

కుశాలీ ఖుషీ

నిశ్శబ్దాన్ని విందాం

నేనంటే భయానికి భయం

సినిమాలో చేసినవి నిజంగా చేస్తామా?

వందమందితో డిష్యూం డిష్యూం