డిజిటల్ మయం

24 Nov, 2016 01:28 IST|Sakshi

సబ్‌స్టేషన్లకు సాంకేతిక మెరుగు
ప్రప్రథమంగా శ్రీకారానికి కసరత్తు
తొలి విడతగా మూడు చోట్ల  ఏర్పాటు
మూడు వేల కిమీ దూరం విద్యుత్ లైన్ల మార్పు
విద్యుత్ బోర్డు చర్యలు

సాక్షి, చెన్నై: అత్యాధునిక సాంకేతిక పరి జ్ఞానాలను అంది పుచ్చుకుని వినియోగదారులకు మెరుగైన సేవల్ని అందించేందుకు తగ్గ ప్రయత్నాలను రాష్ట్ర విద్యుత్ బోర్డు చర్యల్ని వేగవంతం చేసింది. రాష్ట్రంలో ఇక, సబ్‌స్టేషన్లను డిజిటల్ మయం చేయడానికి ప్రత్యేక కార్యచరణ సిద్ధం చేసి ఉన్నారు. ప్రప్రథమంగా మూ డు సబ్‌స్టేషన్లను డిజిటల్ మయం చేయడానికి రంగం సిద్ధం అవుతోంది. ఇక, మూడు వేల కిమీ దూరం మేరకు విద్యుత్ తీగల మార్పిడికి నిర్ణరుుంచారు.  రాష్ట్రంలో 400 కేవీ, 230 కిలో వాట్స్(కేవీ)లతో పాటు 110, 33 తదితర కేవీలతో కూడిన విద్యుత్ సబ్‌స్టేషన్లు నెలకొల్పి ఉన్న విషయం తెలిసిందే. ఇందులో ప్రధానంగా 400 కేవీ, 230 కేవీ సామర్థ్యం కల్గిన స్టేషన్ల ద్వారా విద్యుత్ వినియోగానికి ఇతర చిన్న చిన్న సబ్‌స్టేషన్లకు సరఫరా అవుతూ ఉంటా రుు.

230 కేవీ స్టేషన్లు 26, నాలుగు వందల కేవీ స్టేషన్లు కేవీ స్టేషన్లలో ట్రాన్‌‌సఫార్మర్స్, సర్‌ూక్యట్ బ్రేకర్‌లతో పాటు విద్యుత్ సరఫరా పరికరాలతో కూడిన కంట్రోలింగ్ సిస్టమ్‌లు పెద్ద ఎత్తునే ఉంటారుు. వీటి ఉపయోగం నిమిత్తం ప్రత్యేకంగా వంద కంట్రోల్ కేబుల్స్, పర్యవేక్షణ నిమిత్తం ప్రత్యేక పరికరాలు తప్పని సరి. ఓవర్‌లోడ్ కారణంగా, లీకేజీల రూపంలో, సర్‌ూక్యట్ కారణంగా తరచూ ఆయా స్టేషన్లలో ప్రమాదాలు చోటు చేసుకున్న పక్షంలో, మరమ్మతులకు తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి. అలాగే, కొత్తగా ఒక సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయాల్సి వస్తే, అందుకుగాను 18 నెలలు తప్పని సరి. ఇక, వంద కేబుల్స్ అమరిక, పరిశీలనకు మరో మూడు నెల లు అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర విద్యుత్ బో ర్డు వర్గాలు , మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేయడం, కొత్త స్టేషన్లను సకాలంలో నెలకొల్పడం వంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టే విధంగా సబ్‌స్టేషన్లను డిజిటల్ మయం చేయడానికి చర్యలు చేపట్టారుు.

డిజిటల్ మయం: అత్యాధునిక టెక్నాలజీలను అంది పుచ్చుకుని విద్యుత్ సబ్‌స్టేషన్లను డిజిటల్ మయం చేయడానికి కసరత్తులు చేపట్టారు. డిజిటల్ ప్రక్రియ మేరకు వంద కంట్రోలింగ్ కేబుల్స్‌తో ఇక పని లేదు. కేవలం రెండు ఫైబర్ కే బుల్స్ ఉంటే చాలు. వర్షాలకు ఈ ఫైబర్ తడిసినా సర్‌ూక్యట్‌కు ఆస్కారం లేదు. ఫైబర్ కేబుల్స్ ఆధారంగా, డిజిటల్ ప్రక్రియతో త్వరితగతిన మరమ్మతులను పూర్తి చేయడం, ఓవర్ లోడింగ్‌ను అధిగమించడం, తక్కువ సమయంలో విద్యుత్ సరఫరాకు చర్యలు చేపట్టడం వంటి పనులు చేపట్టవచ్చు. దీంతో సబ్‌స్టేషన్లను డిజిటల్ మయం చేయడానికి నిర్ణరుుంచారు. నాలుగు వందలు, 230 కేవీలు, ఇక డిజిటల్ మయంగా మా రేందుకు తగ్గట్టు చర్యలు వేగవంతం చేశారు. దేశంలోనే  ప్రప్రథమంగా డిజిటల్ మయంను తమిళనాట పరిచయం చేయడానికి సిద్ధం అవుతున్నామని, విద్యుత్ శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు.

చెన్నై తిరువాన్నియూరు,  కోయంబత్తూరు సెల్వపురం, పుదుకోటై్ట వెల్లారు 230 కేవీస్టేషన్లు ప్రప్రథమంగా డిజిటల్ టెక్నాలజీతో విద్యుత్ సరఫరాకు తగ్గట్టుగా చర్యల్లో మునిగి ఉన్నామని వివరించారు. గుజరాత్‌లో పవర్ గ్రిడ్‌‌స నిమిత్తం ప్రయోగాత్మకంగా డిజిటల్ టెక్నాలజీ ఉపయోగించి ఉన్నారని, అరుుతే, సబ్‌స్టేషన్లలో తమిళనాడు ఆ రంగంలో ముందడుగు వేయనున్నదన్నారు. ఇక, రాష్ట్రంలో మూడు వేల కిమీ దూరం మేరకు విద్యుత్ లైన్లు మర్చాల్సిన అవసరం ఉందని గుర్తించారు. ఆ మేరకు  విద్యుత్ లైన్లను మార్చేందుకు తగ్గ కార్యచరణ సిద్ధం చేసి, టెండర్లకు చర్యల్లో విద్యుత్‌బోర్డు వర్గాలు మునిగి ఉన్నారుు.
 

మరిన్ని వార్తలు