శిథిలావస్థకు సింగరేణి క్వార్టర్లు

5 Oct, 2016 12:48 IST|Sakshi
శిథిలావస్థకు సింగరేణి క్వార్టర్లు
  భయాందోళనలో కార్మిక కుటుంబాలు
  పట్టించుకోని అధికారులు
 
గోదావరిఖని : గోదావరిఖని బస్టాండ్ కాలనీలోని సింగరేణి సంస్థకు చెందిన కార్వర్టర్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. పట్టించుకోవాల్సిన అధికారులు చర్యలు తీసుకోవడంలో అలసత్వం ప్రదర్శిస్తుండడంతో క్వార్టర్ల పైకప్పులు ఎప్పుడు కూలుతాయోననే కార్మికులు ఆందోళన చెందుతున్నారు. పట్టణంలో కార్మికుల నివాసానికి అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో యాజమాన్యం 1991లో బస్టాండ్ కాలనీలో క్వార్టర్ల నిర్మాణం పూర్తిచేశారు. ఇందులో 302 టీ2 టైపు, 1995లో 180 ఎస్‌టీ-2 టైపు క్వార్టర్లను నిర్మించారు. టీ2 టైపు క్వార్టర్లు నిర్మించి 25 ఏళ్ళు, ఎస్‌టీ-2 టైపు క్వార్టర్లు నిర్మించి 21 ఏళ్ళు అవుతున్నా యాజమాన్యం వాటికి పూర్తిస్థాయి మరమ్మతులను చేపట్టడం లేదు. ఇటీవల ‘కార్మికుల వద్దకు యాజమాన్యం’ కార్యక్రమంలో అధ్వానంగా ఉన్న క్వార్టర్ల గురించి అధికారులకు ఫిర్యాదు చేసినా సమస్యలను పుస్తకాలలో నమోదు చేసుకున్నారే తప్ప శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. 
 
కూలుతున్న పైకప్పులు 
బస్టాండ్ కాలనీలోని సింగరేణి క్వార్టర్ల  విషయంలో యాజమాన్య పర్యవేక్షణ లోపించడం తో క్వార్టర్ల మధ్యలో మొక్కలు మొలుస్తున్నా యి. వాటి వేర్లు క్వార్టర్ల గోడల లోపలికి చొచ్చుకుని వస్తూ అవి పగిలిపోయి కిందపడేలా చేస్తున్నాయి. క్వార్టర్లకు మరమ్మతులు లేకపోవడం తో బెడ్‌రూమ్‌లు, వంట గదులు, బాతురూమ్ లు, మరుగుదొడ్లలో పైకప్పులు కూలిపోతూ కు టుంబ సభ్యులపై పడుతున్నాయి. పలు క్వార్టర్ల పైకప్పులు కూలినా యాజమాన్యం పట్టించుకోవడం లేదని పలువురు కార్మికులు పేర్కొంటున్నారు.
 
క్వార్టర్ల మధ్యలో నిర్మించిన డ్రైరుునేజీ నిర్మాణాలు కూడా సరిగ్గా లేకపోవడం, కుండీల లోని మురుగు సరిగ్గా వెళ్ళలేక నిలిచి ఉండడం తో దుర్వాసన భరించలేకపోతున్నామని కార్మికులు అంటున్నారు. చాలా ఏళ్ళుగా సున్నం వేయకపోవడంతో గోడలన్నీ నల్లటి మరకలతో నిండిపోయూరుు. ఎవరైనా క్వార్టర్లలోకి కొత్తగా వస్తే క్వార్టర్ లోపలి భాగంలో మాత్రమే సున్నం వేసి బయట వేయకుండా వదిలేస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే క్వార్టర్ బయట సున్నం వేయడం సింగరేణి నిబంధనల్లో లేదని అధికారులు చెబుతున్నారని కార్మికులు వాపోతున్నారు. మొత్తంగా బస్టాండ్ కాలనీలోని సింగరేణి క్వార్టర్లకు మరమ్మతులు చేయకపోతే పైకప్పులు కూలి కార్మికులు, వారి కుటుంబాల ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది.
 
మరిన్ని వార్తలు