ఆరో తరగతిలోనే లవ్‌లెటరా?

28 Dec, 2019 08:15 IST|Sakshi

కర్ణాటక,హుబ్లీ: పసిప్రాయంలోనే  ఓ విద్యార్థి లవ్‌లెటర్‌ రాయడంపై జిల్లా అధికారి గమనించి ముక్కున వేలేసుకున్నారు. ఈ ఘటన ఉప్పినబెటగేరిలో చోటు చేసుకుంది. వరద ఉధృతికి హాని వాటిల్లిన ఇళ్ల పరిశీలన కోసం జిల్లాధికారి దీపా చోళన్‌  గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఈక్రమంలో శుక్రవారం ఉప్పినబెటగేరికి వెళ్లారు. అక్కడే గుమిగూడిన పిల్లలను ఆమె మాట్లాడించారు. అప్పుడు ఇంటి ఎదురుగా పుస్తకంలో ఏదో రాస్తున్న ఆరవ తరగతి బాలుడి దగ్గరకు వెళ్లారు. ఆప్పుడు ఆ బుడతడు ఐ లవ్‌ యూ అంటూ రాయడంతో డీసీ ముక్కున వేలు వేసుకోక తప్పలేదు. అయితే ఈ పదేళ్ల బడుద్దాయి పుస్తకాన్ని వదిలి పారిపోవడం కొసమెరపు. ఈ ఘటనతో దీపాచోళన్‌ మాత్రం తనలో తాను నవ్వుకోవడం కనిపించింది.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు