రేపు అసెంబ్లీలో డీఎంకే వ్యూహం ఏంటి?

17 Feb, 2017 13:12 IST|Sakshi
రేపు అసెంబ్లీలో డీఎంకే వ్యూహం ఏంటి?

చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో శనివారం జరిగే బలపరీక్షలో తటస్థంగా ఉండాలని ప్రతిపక్ష డీఎంకే యోచిస్తోంది. కాసేపట్లో డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రతిపక్ష నేత స్టాలిన్ అధ్యక్షతన ఆ పార్టీ వ్యూహ కమిటీ సమావేశం కాబోతోంది. రేపు అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.

బలపరీక్షలో ముఖ్యమంత్రి పళనిస్వామి మెజార్టీ నిరూపించుకుంటారా? మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గీయులు ఎలా వ్యవహరిస్తారన్న విషయాలపైనా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశముంది. కాగా అన్నా డీఎంకే రాజకీయాల్లో తలదూర్చరాదని, బలపరీక్షలో తటస్థంగా ఉండాలని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం స్టాలిన్ పార్టీ ఎమ్మెల్యేలతో కూడా సమావేశమై చర్చించనున్నారు. నిన్న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన పళనిస్వామి రేపు ప్రత్యేకంగా సమావేశమయ్యే తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోనున్నారు.