డీఎంఆర్‌సీ డాక్యుమెంట్లను డిజిటలీకరణ

16 Feb, 2015 23:00 IST|Sakshi

 న్యూఢిల్లీ: డాక్యుమెంట్ల రూపంలో భద్రపరిచే ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(డీఎంఆర్‌సీ) సమాచారాన్ని అవసరమైనప్పుడు క్షణాల్లో తిరిగి చూసుకునేలా డిజిటలైజ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఇన్‌ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసీ) ఏజెన్సీ రూపొందించిన ఈ వెబ్‌సైట్‌ను డీఎంఆర్‌సీ మేనేజింగ్ డెరైక్టర్ మంగూ సింగ్, ఎన్‌ఐసీ డిప్యూటీ డైరక్టర్ జనరల్ రాజీవ్ ప్రకాశ్ మెట్రో భవన్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా సింగ్ మాట్లాడుతూ వెబ్‌సైట్ రూపకర్తలను అభినందించారు.  దీనిని సక్రమంగా వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. కాగా, భవిష్యత్‌లో కూడా సంస్థ ఉద్యోగుల కోసం మరిన్ని ఆధునిక సాంకేతిక పద్ధతులను వినియోగిస్తామని డీఎంఆర్‌సీ సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. దీర్ఘకాలంపాటు డాక్యుమెంట్లను సంరక్షించడమే కాకుండా ఎప్పుడు కావలంటే అప్పుడు క్షణాల్లో సమాచారాన్ని చూసుకోవడానికి శాస్త్రిపార్కులోని నేషనల్ డేటా సెంటర్‌లోని ఎన్‌ఐసీ సర్వర్ తోడ్పతుందని చెప్పింది.
 

>
మరిన్ని వార్తలు