మూణ్నెళ్లు మద్యం షాపులు బంద్‌

25 Apr, 2017 19:06 IST|Sakshi
మూణ్నెళ్లు మద్యం షాపులు బంద్‌

చెన్నై: జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన ఉన్న మద్యం షాపులను మూడు నెలల పాటు తెరవరాదని, అలాగే ఇతర ప్రాంతాలకు తరలించరాదని మద్రాస్‌ హైకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో ఆ రాష్ట్రంలో 3300కు పైగా మద్యం షాపులు మూతపడనున్నాయి.

డీఎంకే నేత ఆర్ఎస్ భారతి, అడ్వకేట్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్‌ అధ్యక్షుడు కే బాలు వేసిన వేర్వేరు పిటిషన్లను కోర్టు విచారించింది.  చీఫ్‌ జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్ ఎం సుందర్‌లతో కూడిన బెంచ్‌ ఈ కేసును విచారించారు. మూడు నెలల వరకు జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కన ఉన్న మద్యం దుకాణాలను తెరవరాదని, అలాగే మరో చోటకు తరలించరాదని తీర్పు చెప్పారు.

ఏప్రిల్‌ నుంచి జాతీయ, రాష్ట్రాల హైవేల పక్కన మద్యం షాపులను నిర్వహించరాదని గతంలో సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వులను అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. హైవేల పక్కన మద్యం అమ్మకాల వల్ల రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోందని, ప్రయాణికుల భద్రత దృష్ట్యా మద్యం షాపులను మూసివేయించాలని పేర్కొంది.  ప్రస్తుతమున్న షాపుల లైసెన్సులను రెన్యువుల్‌ చేయరాదని సుప్రీం కోర్టు సూచించింది.

మరిన్ని వార్తలు