మోడల్ జీపీల ఏర్పాటే లక్ష్యం

15 Oct, 2016 11:18 IST|Sakshi

అక్రమలే అవుట్లపై కొరడా
పారిశుధ్యం, తాగునీటి వసతులపై ప్రత్యేక దృష్టి
‘సాక్షి‘తో జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్
 
హాజీపూర్(మంచిర్యాల రూరల్) : గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తూ అధికారులు ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా తగిన చర్యలు తప్పవని మంచిర్యాల జిల్లా పంచాయతీ అధికారి చిట్టుమల్ల చంద్రశేఖర్ పేర్కొన్నారు. కొత్త జిల్లా ఏర్పాటు నేపథ్యంలో డీపీవో బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖర్‌తో ‘సాక్షి‘ ప్రత్యేక ఇంటర్వ్యూ..
 
 సాక్షి : ఇప్పటి వరకు పంచాయతీ వ్యవస్థలో ఎలాంటి బాధ్యతలు చేపట్టారు?
 డీపీవో : 1990లో గ్రూప్-2 ద్వారా పంచాయతీ రాజ్ వ్యవస్థలో భాగంగా బాధ్యతలు స్వీకరించాను. ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్, మావల గ్రేడ్ పంచాయతీలో పని చేశాను. 2007లో ఈవోపీఆర్డీగా పని చేశారు. ఇక ఎంపీడీవోగా కౌటాల, బెజ్జూర్, తాంసీలో పని చేశాను.
 
 ఇన్‌చార్జి డీఎల్పీవోగా 2010లో ఆదిలాబాద్‌లో పని చేశాను. 2013 నుంచి ఇప్పటి వరకు డివిజినల్ పంచాయతీ అధికారి(డీఎల్పీవో)గా జగిత్యాలలో పని చేశాను. జిల్లాల ఏర్పాటులో భాగంగా జీపీ అధికారిగా పదోన్నతి పొంది మంచిర్యాల జిల్లాలో మొదటి డీపీవోగా బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషంగా ఉంది.
 
 సాక్షి : పారిశుధ్యం, తాగు నీరు అంశాల్లో ఏ విధంగా ముందుకెళ్తున్నారు?
 డీపీవో : మంచిర్యాల జిల్లాలో 18 మండలాలు ఉం డగా మొత్తం 205 గ్రామ పంచాయతీలున్నాయి. వ్యా ధుల సీజన్ అని కాకుండా ప్రతీ కాలంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ఎప్పటికప్పుడు వ్యూ హా త్మకంగా ముందుకు వెళ్తాం. మురికికాలువలు శ ుభ్ర ం, క్లోరినేషన్ తదితర అంశాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
 
 సాక్షి : వర్షాకాల సీజన్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
 డీపీవో : వర్షాకాల సీజన్‌లో భాగంగా ఈ అక్టోబర్‌లో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తాం. ప్రజలకు సురక్షిత నీరు అందేలా చూస్తాం. పౌష్టికాహారం, వైద్యం విషయాల్లో కూడా సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నాం. ముఖ్యంగా పందుల పెంపకం గ్రామాల్లో జరగకుండా చూస్తాం.
 
 సాక్షి : గ్రామాల అభివృద్ధిలో ఎలా ముందుకెళ్తున్నారు?
 డీపీవో : గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులకు పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు అవగాహన కల్పించడం, తగిన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేపడుతాం. అభివృద్ధిలో ప్రత్యేక ప్రణా
 ళికతో గ్రామాలను ఆదర్శంగా తయారు చేసేలా చూస్తాం.
 
 సాక్షి : నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు వస్తున్నాయి. ఎలా అధిగమిస్తారు ?
 డీపీవో : పలు జీపీల్లో నిధుల దుర్వినియోగం జరుగుతున్నట్లు సర్వత్రా ఆరోపణలు వస్తున్నాయి. అవి మా దృష్టికి కూడా వచ్చాయి. ఈ విషయంలో ఇకపై కఠినంగా వ్యవహరి స్తాం. ప్రజలకు జవాబుదారీ తనంగా ఇదే సమయంలో పారదర్శక పాలన అందేలా బాధ్యతల నిర్వహణ  సాగుతుంది.
 
 సాక్షి : మోడల్ గ్రామ పంచాయితీలపై ఎలా వ్యవహరిస్తారు?
 డీపీవో : జిల్లాలో మోడల్ గ్రామ పంచాయతీల ఏర్పాటుకు కృషి చేస్తాం. మొదటి విడతలో మండలానికి 2 గ్రామాలను మోడల్ జీపీలుగా తీర్చిదిద్దడానికి ప్రణాళికతో ముందుకు సాగుతాం.
 
 సాక్షి : పన్నుల వసూళ్లు ఎలా ఉన్నాయి?
 డీపీవో : జిల్లాలో పన్నుల వసూళ్లు ఆశాజనకంగా ఉన్నాయి. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో ఆయా గ్రామాల పన్నుల లక్ష్యాలను మాత్రం వచ్చే జనవరిలోగా సాధించేలా అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నాం. గత ఆర్థిక సంవత్సరంలో చాలా వరకు 100 శాతం పన్నుల లక్ష్యాలను చేరుకున్నాం.
 
 సాక్షి : అక్రమ లే అవుట్ వెంచర్లపై ఏ విధంగా వ్యవహరిస్తున్నారు?
 డీపీవో : ముందు ఆ అనుమతులు లేని వెంచర్లలో ప్రజలు స్థలాలు కొనుగోలు చేసి ఇబ్బందులు పడొద్దు. భవిష్యత్తులో ఇంటి నిర్మాణ విషయంలో ఇబ్బందులు తప్పవు. ఇక అక్రమ లే అవుట్ విషయంలో కూడా కఠినంగా వ్యవహరిస్తాం. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అ నుమతులు లేకుండా ఏర్పాటు చేసిన వెంచర్లపై నివేది క తెప్పించుకున్నాం. అక్రమ లే అవుట్‌లపై కొరడా ఝుళిపిస్తాం.
 
 సాక్షి : జీపీల అభివృద్ధికి చర్యలు?
 డీపీవో : జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామ పంచాయతీల అభివృద్ధికి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతాం. గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు చేపడతాం. క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ ఉంటుంది. పంచాయతీ అధికారులు, సిబ్బంది ని బద్ధతగా పని చేయాలి.
 

మరిన్ని వార్తలు