నాటకం ఇక ముగిసింది: కార్తీ చిదంబరం

17 May, 2017 12:39 IST|Sakshi
నాటకం ఇక ముగిసింది: కార్తీ చిదంబరం

చెన్నై : కేంద్ర మాజీమంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం ఎట్టకేలకు సీఐబీ దాడులపై స్పందించారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ డ్రామా ఇక ముగిసిందని, తాను ఏ తప్పు చేయలేదని, సీబీఐ దాడులు రాజకీయ కక్ష సాధింపులో చర్యలేనని అన్నారు. కాగా ఒక మీడియా సంస్థ నుంచి ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలతో కార్తీ చిదంబరం నివాసాలు, కార్యాలయాల్లో మంగళవారం సీబీఐ ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియాపై ఐటీ దర్యాప్తును పక్కదోవ పట్టించేందుకు ఆర్థిక శాఖ, విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ(ఎఫ్‌ఐపీబీ)అధికారుల్ని కార్తీ ప్రభావితం చేసినట్లు సీబీఐ ఆరోపించింది.

ఉదయం నుంచి పొద్దుపోయేవరకూ చెన్నై, ముంబై, ఢిల్లీ, గురుగ్రామ్‌ల్లో 14 చోట్ల కార్తీ ఆస్తులపై సీబీఐ అధికారులు తనిఖీలు చేశారు. మరోవైపు సీబీఐ దాడులను చిదంబరం కూడా తీవ్రంగా ఖండించారు. తన కుమారుడే లక్ష్యంగా సీబీఐ, ఇతర దర్యాప్తు సంస్థల్ని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆయన ఆరోపించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు