ఆస్పత్రిలో తాగుబోతు వీరంగం

27 Feb, 2018 13:46 IST|Sakshi
లేడీ డాక్టర్‌నను వెంబడిస్తున్న తాగుబోతు

నెలమంగల(దొడ్డబళ్లాపురం): తాగుబోతు ప్రభుత్వాస్పత్రిలో వీరంగం సృష్టించి వైద్యులను ఇబ్బందులకు గురి చేశాడు. ఈఘటన నెలమంగల ప్రభుత్వాస్పత్రిలో చోటుచేసుకుంది. పట్టణ నివాసి శివకుమార్‌ సోమవారం మద్యం సేవించి ప్రభుత్వాస్పత్రికి వచ్చాడు. తనను బార్‌ వద్ద కొందరు కొట్టారని, పోలీసులకు ఫిర్యాదు చేయాలని మెడికల్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాలని సిబ్బందిని వేధించడం మొదలుపెట్టాడు. లేడీ డాక్టర్లు ఏ వార్డుకెళ్లినా వెంబడించి తల బాదుకుంటూ మెడికల్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాలని డిమాండుచేశాడు. వైద్యులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆస్పత్రికి చేరుకొని  ఎవరు కొట్టారో గుర్తించి అరెస్టుచేస్తామని సర్ది చెప్పి పంపించారు.

మరిన్ని వార్తలు