కలెక్టర్‌కు డమ్మీ టైమ్ బాంబు పార్శిల్

8 Aug, 2015 10:24 IST|Sakshi
కలెక్టర్‌కు డమ్మీ టైమ్ బాంబు పార్శిల్

వేలూరు: వేలూరు సత్‌వచ్చారిలోని తపాల బాక్సులో వేలూరు కలెక్టర్ పేరుపై వచ్చిన పేలుడు వస్తువులతో కూడిన డమ్మీ టైమ్ బాంబు పార్శిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొని విచారణ చేస్తున్నారు.  వేలూరు కోర్టు ఎదుట తపాల కార్యాలయం ముఖ ద్వారం వద్ద తపాలా బాక్సును ఏర్పాటు చేశారు. ఈ బాక్సులో శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో తపాలా సిబ్బంది బాక్సును తెరిచి ఉత్తరాలను తీసుకున్నాడు.
 
 ఈ సమయంలో బాక్సులో ప్యాకింగ్  చేయబడిన ఒక పార్శిల్ ఉంది. దీనితో పాటు ఒక మెమరీ కార్డు, ఒక గడియారం అందులో ఉన్నది. ఈ బాక్సుపై టు అడ్రసు వేలూరు కలెక్టర్ పేరుతో ఉండడంతో గమనించిన తపాలా సిబ్బంది వెంటనే పార్శిల్‌ను తీసి బయటకు వేశారు. ఆ సమయంలో పార్శిల్ చినిగిపోవడంతో అందులో ఉన్న వైర్లు బయటకు కనిపించడంతో ఆశ్చర్య పోయిన సిబ్బంది తపాలా అధికారులకు, పోలీసులకు సమాచారం అందజేశారు.
 
వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న సత్‌వచ్చారి పోలీసులు పార్శిల్ వద్దనున్న మెమరీ కార్డు, గడియారంను స్వాధీనం చేసుకున్నారు. పార్శిల్‌లో వైర్లు తెలుస్తున్నందున బాంబు ఉండవచ్చునని బాంబు స్క్వాడ్ వైర్లను కత్తరించారు.  అనంతరం బాక్సును వేర్వేరుగా విప్పి చూడగా అందులో మూడు డిటోనేటర్‌లు, మూడు చిన్న వైర్లు ఉండడంతో పోలీసులు ఏమి చేయాలో తె లియకుండా వెంటనే వాటిని పోలీసుల వ్యాన్‌తో తీసుకెళ్లారు. దీనిపై ఎస్పీ సెంథిల్ కుమారి నేరుగా వచ్చి పరిశీలించి వీటిపై విచారణను వేగవంతం చేయాలని పోలీసులకు ఆదేశించారు.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సముద్రాన్ని తలపిస్తున్న ఊటీ

ఎంపీ సుమలత ట్వీట్‌పై నెటిజన్ల ఫైర్‌

బళ్లారి ముద్దుబిడ్డ

అయ్యో.. ఘోర రోడ్డు ప్రమాదం

లక్షలు పలికే పొట్టేళ్లు

తేలుతో సరదా

‘దీప’కు బెదిరింపులు..!

240 కి.మీ.. 3 గంటలు..!

క్యాబ్‌ దిగుతావా లేదా దుస్తులు విప్పాలా?

ప్రయాణికులు నరకయాతన అనుభవించారు..

రూ.లక్ష ఎద్దులు రూ.50 వేలకే

సిద్దార్థ శవ పరీక్ష నివేదిక మరింత ఆలస్యం 

సీఎంకు డ్రైప్రూట్స్‌ బుట్ట.. మేయర్‌కు ఫైన్‌

రాజకీయాల్లో ఉండాలనిపించడం లేదు  

నకిలీ జర్నలిస్టుల అరెస్ట్‌

వింత ఆచారం.. ‘ఎర్రని’ అభిషేకం!

ప్రతిపక్షాలను ఊహించని దెబ్బతీశారు..

చోరీకి వెళ్లిన దొంగకు చిర్రెత్తుకొచ్చింది...

ఇంటి ముందు నాగరాజు ప్రత్యక్షం

ఇందిరానగర్‌ మెట్రో స్టేషన్‌లో పిల్లర్‌ చీలిక

ముస్లిం మహిళలపై అనుచిత వ్యాఖ్యలు

చినజీయర్‌ ఆశీస్సుల కోసం వచ్చా....

మిడ్‌నైట్‌ మెట్రో

పోలీస్‌స్టేషన్‌లో ప్రేమ పెళ్లి

కాఫీ కింగ్‌కు కన్నీటి వీడ్కోలు

కూలిన బ్యాంకు పైకప్పు..

కాఫీ డే ‘కింగ్‌’ కథ విషాదాంతం

చెత్తే కదా అని పారేస్తే..

ప్రమాదకర స్థాయిలో గోదావరి..

అంత డబ్బు మా దగ్గర్లేదు..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. అలీ రెజాపై నాగ్‌ సీరియస్‌

అంత టైమివ్వడం నాకిష్టం లేదు : ప్రభాస్‌

అందర్నీ ఓ రౌండ్‌ వేసుకుంటోన్న నాగ్‌

‘సాహో’ ట్రైలర్‌ వచ్చేసింది

బిగ్‌బాస్‌.. అలీ రెజాపై నాగ్‌ ఫైర్‌

ప్రముఖ బాలీవుడ్‌ నటి ఆరోగ్యం ఆందోళనకరం