ఈ సారైనా అమ్మ దర్శనం కలిగేనా ?

11 Oct, 2016 08:19 IST|Sakshi

సీతానగరం ఘాట్‌కు తెప్పోత్సవం వచ్చి ఐదేళ్లు


 తాడేపల్లి : దసరా పండగ రోజు సాయంత్రం విజయవాడ కనకదుర్గమ్మ నదిలో హంసతూలికా తల్పంపై భక్తులకు దర్శనమివ్వడం ఏటా ఆనవాయితీ. ఈ సంవత్సరమైనా దేవాదాయశాఖ అధికారులు అమ్మవారి హంసవాహన ఉత్సవాన్ని విజయవాడ దుర్గఘాట్ నుంచి సీతానగరం కృష్ణవేణి ఘాట్ వరకూ తీసుకొస్తారా? లేదా అనే అంశంపై ప్రజల్లో చర్చ నడుస్తోంది.

ఐదేళ్ల క్రితం దసరా పండుగ సమయంలో కృష్ణమ్మకు వరదలు రావడంతో అమ్మవారి హంస వాహన దర్శనం నదిలో కొద్దిదూరం నిర్వహించి వెంటనే వెనక్కి తిప్పి దుర్గఘాట్‌కి తరలించారు. ఆ దివ్య మంగళదృశ్యాన్ని వీక్షించడానికి భక్తులు అశేషంగా బ్యారేజ్ వద్దకు చేరుకునేవారు.  ఐదేళ్లుగా అమ్మవారి హంసవాహనం మొక్కుబడిగా కొద్ది దూరం నదిలోకి తీసుకొచ్చి వెనక్కి తీసుకెళ్తుతున్నారు. ఈసారైనా అమ్మవారి దివ్య దర్శనం కలిగించాలని భక్తులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు