ఇంకా దొరకని విమానం ఆచూకీ

24 Jul, 2016 18:09 IST|Sakshi
ఇంకా దొరకని విమానం ఆచూకీ

చెన్నై: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏఎన్-32 విమానం అదృశ్యమై మూడు రోజులు కావస్తున్నా ఇంకా ఆచూకీ దొరకలేదు. బంగాళాఖాతంలో విమాన ప్రమాదం జరిగిందని భావిస్తున్న ప్రాంతంలో లోతు ఎక్కువగా ఉందని నేవీ అధికారులు చెప్పారు. మూడున్నర కిలో మీటర్ల మేర సముద్రంలోతు ఉండటంతో గాలించడానికి కష్టమవుతోందని తెలిపారు.

మూడో రోజు ఆదివారం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 18 నౌకలు, 8 విమానాలు, ఒక సబ్మెరైన్ సాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఉపగ్రహాల సాయంతో శోధిస్తున్నారు. సముద్రంలో ప్రతికూల వాతావరణం ఉండటం గాలింపు చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది.

ఈ నెల 22న చెన్నైలోని తాంబరం వైమానిక స్థావరం నుంచి పోర్ట్‌ బ్లెయిర్ బయలుదేరిన ఈ విమానం గాల్లోకి ఎగిరిన కాపేటికే గల్లంతయిన సంగతి తెలిసిందే. ఈ విమానంలో మొత్తం 29మంది ఉండగా, వీరిలో 9 మంది విశాఖపట్నం వాసులు ఉన్నారు.

మరిన్ని వార్తలు