అర్ధరాత్రి2.2

4 Feb, 2019 12:33 IST|Sakshi

శివమొగ్గ జిల్లా తీర్థహళ్లి, హొసనగర తాలూకాల్లో భూకంపం  

నిద్ర మేల్కొని జనం పరుగులు  

శివమొగ్గ: బెంగళూరుకు భూకంపభయం ఉందని పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో, శివమొగ్గ జిల్లాలో శనివారం అర్ధరాత్రి దాటాక 1.33 గంటల సమయంలో భూకంపం రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. జిల్లాలోని తీర్థహళ్లి, హొసనగర తాలూకాలో ఉన్న పశ్చిమఘట్ట అటవీ ప్రాంతం పరిధిలో ఉన్న గ్రామాల్లో భూమి కంపించడంతో ప్రçజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌ పైన 2.2 తీవ్రత ఉన్నట్లు అధికారులు తెలిపారు. 

రెండు మూడు సెకన్లు ప్రకంపనలు  
ప్రకంపనలు వస్తుండడంతో నిద్రలో ఉన్న ప్రజలు మేలుకుని ఏమైందోననుకుంటూ తలోదిక్కుకు పరుగులూ పెట్టినట్లు తెలిపారు. తీర్థహళ్ళి, హోసనగర తాలుకాల్లొ సరిహద్దులోని గ్రామాల్లో రెండు మూడు సెకన్లపాటు భూమి కంపించింది. తీర్థహళ్ళి తాలుకాలోని గాడరగెద్దె, హురుళి, మేరగహళ్ళి, హనస, తీర్థహళ్ళి తాలుకాలోని వారాహి, జలాశయం చుట్టు పక్కలున్న కోరనకుంటెతో పాటు చుట్టుపక్కల ఉన్న మరికొన్ని గ్రామాల్లోనూ ప్రకంపనలు సంభవించాయి. ఆస్తి, ప్రాణనష్టాలు జరిగినట్లు వెల్లడి కాలేదు.

మరిన్ని వార్తలు