నేటితో తెర

17 Nov, 2016 04:02 IST|Sakshi

►  ఓటర్లకు కరుణ వేడుకోలు         
చివరి ప్రచారంలో పరుగులు
నేతలకు ఈసీ హుకుం జారీ           
రద్దు పిటిషన్ తిరస్కృతి
ఫిర్యాదుల హోరు

సాక్షి, చెన్నై : ఉప ఎన్నికల ప్రచారం గురువారంతో తెర పడనుంది. బయటి వ్యక్తులు నియోజకవర్గాల్ని వదిలి వెళ్లి పోవాలని రాష్ట్ర  ఎన్నికల ప్రధాన అధికారి రాజేష్‌లఖాని హుకుం జారీ చేశారు. చివరి ప్రచారంగా బుధవారం నేతలు ఆగమేఘాలపై పర్యటన సాగించారు. డీఎంకే, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ డీఎంకే అధినేత కరుణానిధి ఓటర్లకు పిలుపునిచ్చారు.తంజావూరు, అరవకురిచ్చి, తిరుప్పరగుండ్రంలతో పాటు పుదుచ్చేరిలో శనివారం ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అరవకురిచ్చిలో అన్నాడీఎంకే అభ్యర్థిగా మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ, డీఎంకే అభ్యర్థిగా సీనియర్ నాయకుడు కేసీ పళనిస్వా మి, బీజేపీ అభ్యర్థిగా ప్రభు, పీఎంకే అభ్యర్థిగా భాస్కరన్, డీఎండీకే అభ్యర్థిగా అరవైముత్తు పోటీలో  ఉన్నారు.

తంజావూరులో డీఎంకే అభ్యర్థిగా డాక్టర్ అంజుగం భూప తి, అన్నాడీఎంకే అభ్యర్థిగా రంగస్వామి, బీజేపీ అభ్యర్థి ఎంఎస్ రామలింగం, డీఎండీకే అభ్యర్థిగా అబ్దుల్ షేట్, పీఎంకే అభ్యర్థిగా కురింజి పాదం, నామ్ తమిళర్ కట్చి అభ్యర్థిగా నల్లదురై తీవ్ర ఓట్ల వేటలో మునిగారు. మదురై జిల్లా తిరుప్పరగుం డ్రంలో అన్నాడీఎంకే అభ్యర్థి ఏకే బోసు, డీఎంకే అభ్యర్థి శరవణన్, డీఎండీకే అభ్యర్థిగా ధనపాండియన్ పోటీలో ఉన్నారు. తనకు మామిడి చిహ్నం కేటారుుంచలేదన్న ఆవేదనతో పీఎంకే అభ్యర్థిగా సెల్వం ఎన్నికల నుంచి తప్పుకున్నారు. పుదుచ్చేరిలోని నెల్లితోపు ఎన్నికల రేసులో ఆ రాష్ట్ర సీఎం నారాయణ స్వామి కాంగ్రెస్ అభ్యర్థిగా, ఓం శక్తి శేఖర్ అన్నాడీఎంకే అభ్యర్థులుగా ప్రధాన పోటీలో ఉన్నారు. ఇన్నాళ్లు ఓటర్లను ఆకర్షించేందుకు ఆయా అభ్యర్థులు, వారి మద్దతుదారులు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనతో దూసుకెళ్లారు.

ఇంటింటా తిరుగుతూ ఓటర్లను ఆకర్షించే యత్నం చేశారు. ఆయా పార్టీల నేతలు స్టాలిన్, విజయకాంత్, అన్భుమణి రాందాసులతో పాటు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పదుల సంఖ్యలో నియోజకవర్గాల్లో తిష్ట వేసి ప్రచారంలో దూసుకెళ్లారు. గురువారం సాయంత్రంతో ప్రచారం స మాప్తం కానున్నడండతో చివరి ప్రయత్నంగా మళ్లీ ఓట్ల వేటలో పరుగులు సాగించారు. బుధవారం డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ తంజావూరులో సుడిగాలి పర్యటన సాగించడం గమనార్హం.

కరుణ వేడుకోలు: ఎన్నికల ప్రచారంలోకి తాను, పార్టీ ప్రధాన కార్యదర్శి అన్భళగన్ రాలేకున్నా, తమ ప్రతినిధిగా కోశాధికారి స్టాలిన్ వచ్చినట్టు గుర్తు చేశారు. అన్నాడీఎంకే అధికార, ధన బలంతో ఓటర్లను మభ్య పెట్టే యత్నం చేస్తున్నదని, దీనిని అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సాగుతున్న అద్వాన పాలనకు గుణపాఠం నేర్పే విధంగా ఓటర్లు తమ తీర్పును ఇవ్వాలని విన్నవించారు. ఓటమి భయం అన్నాడీఎంకేలో నెలకొని ఉన్నదని, అందుకే సీఎం జయలలిత పేరుతో ప్రకటన నాటకాన్ని రచించినట్టున్నారని ఆరోపించారు. ఓటర్లు ఆలోచించి తమ నిర్ణయాన్ని తంజావూరు, తిరుప్పరగుండ్రం, అరవకురిచ్చిల్లో డీఎం కే అభ్యర్థులకు, పుదుచ్చేరి నెల్లితోపులో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలన్నారు.

నేటితో తెర: గురువారం సాయంత్రం ఐదు గంటలతో ప్రచారానికి తెర పడనుండడం తో ఎన్నికల యంత్రాంగం రంగంలోకి ది గింది. నియోజకవర్గాల్లో తిష్ట వేసి ఉన్న ఇతర ప్రాంతాలకు చెందిన నేతలు వెళ్లి పోవాలని, లేని పక్షంలో చర్యలు తప్పద న్న హెచ్చరికల్ని ఈసీ రాజేష్‌లఖాని జారీ చేశారు. అలాగే, సోషల్ మీడియాలు, వా ట్సాప్, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ఓటర్లను ఆకర్షించే యత్నం చేసినా చర్యలు తప్పదన్న హెచ్చరికలు జారీ అయ్యారుు. అన్ని పార్టీ ల నాయకులు, కార్యకర్తలు, ఆయా నియోజకవర్గాలకు సంబంధం లేని వాళ్లంతూ బ యటకు వెళ్లాల్సిందేనని ఈసీ వివరించా రు. అలాగే, అభ్యర్థులకు సైతం ఆంక్షలు జారీ చేశారు. ఆ మేరకు వ్యక్తిగత అవసరాలకు ఒకే ఒక వాహనం, ఏజెంట్ల కోసం మరో వాహనం, కార్యకర్తల కోసం మరో వాహనం, మొత్తం మూడు వాహనాలను మాత్రమే ఉపయోగించాలని సూచించా రు.

శనివారం ఉదయం ఏడు గంటల నుం చి సాయంత్రం ఐదుగంటల వరకు ఓటిం గ్ జరుగుతుందని పేర్కొంటూ, అందుకు తగ్గ అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని వివరించారు. అధికార పక్షం నోట్ల కట్టల్ని చల్లుతోందంటూ ఆయా నియోజకవర్గాల్లోని ఎ న్నికల అధికారులకు ఫిర్యాదులు హోరెత్తుతున్నారుు. అరవకురిచ్చిలో ఏకంగా ఎన్నికల అధికారులకు ఆధారాలతో సహా పీ ఎంకే అభ్యర్థి భాస్కరన్ ఫిర్యాదు చేయడం గమనార్హం.

పిటిషన్ రద్దు: సీఎం జయలలిత అన్నాడీఎంకే అభ్యర్థులు బీ- ఫామ్‌లో వేలి ముద్ర వేసి ఉన్న విషయం తెలిసిందే. ఈ దృష్ట్యా, ఆ అభ్యర్థులు నామినేషన్లను పరిగణించ వద్దని దాఖలైన పిటిషన్లను ఇప్పటికే మ ద్రాసు హైకోర్టు తిరస్కరించింది. ఈ పరిస్థితుల్లో ఆ వేలి ముద్రల్ని భూతద్దంలో పెట్టి చూపిస్తూ తంజావూరులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న రాజీవ్‌గాంధీ దాఖలు చేసిన పిటిషన్ విచారణ బుధవారం హై కోర్టు బెంచ్ ముందుకు వచ్చిం ది. పిటిషన్ ను పరిశీలించిన బెంచ్, ఇప్పటి కే ఇలాం టివి చాలా వచ్చాయని, వాటన్నిం టిని తి రస్కరించినట్టుగానే దీనిని పక్కన పెడుతున్నట్టు ప్రకటించారు. హైకోర్టుకు ఈ రాజకీయాలు ఏమిటో అంటూ బెంచ్ అసహనం వ్యక్తం చేస్తూ పిటిషనర్‌కు అక్షింతలు వేసింది.

>
మరిన్ని వార్తలు