ఏనుగుల హల్‌చల్

10 Aug, 2013 03:33 IST|Sakshi
 క్రిష్ణగిరి, న్యూస్‌లైన్: హొసూరు సమీపంలోని పోడూరు అటవీ ప్రాంతం నుంచి వచ్చిన నాలుగు ఏనుగుల మంద తుప్పుగానపల్లి అగరం, శ్యానమావు గ్రామాల వద్ద గురువారం రాత్రి హల్‌చల్ చేసింది. శ్యానమావు, తుప్పుగాన పల్లి, అగరం గ్రామాల్లో వరి, టమాట పంటలను తొక్కి ధ్వంసం చేశాయి. అగరం గ్రామానికి చెందిన రైతులు మునిస్వామి (40) వరి, తక్కాలి పంటలను ధ్వంసం చేశాయి.  రామయ్యకు చెందిన వరి నారుమడి, వెంకటేశ్, కుంజప్పలకు చెందిన వరి పంటను ధ్వంసం చేశాయని రైతులు తెలిపారు. 
 
లక్షలాది రూపాయలు నష్టం వాటిల్లినట్లు రైతులు వాపోయారు. ఈ నాలుగు ఏనుగుల మందలో ఒక ఏనుగు అడవిలోకి వెళ్లిపోగా, మరో ఏనుగు తప్పించుకుంది. మిగిలిన రెండు ఏనుగులు తుప్పుగానపల్లి చెరువులో తిష్టవేశాయి. తప్పించుకున్న ఏనుగు ఎటువైపు వెళ్లిందోనని అటవీశాఖ అధికార్లు ఆరా తీస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి చెరువులో మకాం వేసిన ఏనుగులు ఎక్కడికి వెళ్లకుండా అటవీశాఖ అధికారులు గస్తీ నిర్వహిస్తున్నారు. తుప్పుగానపల్లి చెరువులో మకాం వేసిన  ఏనుగులను సాయంత్రానికి పోడూరు అటవీ ప్రాంతానికి తరలించనున్నట్లు అటవీశాఖ అధికార్లు తెలిపారు. 
 
మరిన్ని వార్తలు