ఆప్ ఆవిర్భావం మార్పునకు సంకేతం

11 Dec, 2013 01:17 IST|Sakshi
ఇస్లామాబాద్: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆవిర్భా వం భారత రాజకీయాల్లో మార్పుకు సంకేతమని పాకిస్థాన్ జాతీయ దిన పత్రిక డాన్ కొనియాడిం ది. భారత సంప్రదాయ రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ పక్షాలపై ఆప్ సాధించిన విజ యం రాజకీయాల్లో నూతన ఒరవడికి సంకేతంగా నిలిచిందని పేర్కొంది. రాజకీయాల్లో మధ్య తరగతి ప్రజల ప్రాధాన్యానికి ఇది గుర్తుగా నిలిచింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో గణనీయమైన స్థాయిలో విజయం సాధించింది. కాం గ్రెస్‌ను చిత్తు చేయడమే కాదు బీజేపీని కంగుతిని పించింది. రాజకీయ పార్టీల వైఫల్యాల మూలా లు వ్యవస్థలోనే ఉన్నాయని భారతీయ ప్రజలు గుర్తించినట్లు కనిపిస్తుంది. 
 
 అసమర్థ, అవినీతి ఆచరణకు ఏ పార్టీ అతీతంగా లేదని ప్రకటించారు’’ అని డాన్ పత్రిక తన సంపాదకీయంలో పేర్కొంది. ‘‘మధ్యతరగతి ప్రజల్లో  పెరుగుతున్న ఆత్మనిశ్చయానికి ఈ రాజకీయాలు నిదర్శనంగా నిలిచాయి. అవినీతితో పాటు, మధ్య తరగతి ప్రజల సమస్యలను తీవ్రంగా పట్టించుకోవాల్సిన పరిస్థితి ముందుకొచ్చింది’’ అని స్పష్టం చేసింది. ఇటీవలి నాలుగు రాష్ట్రాల ఎన్నికలు బీజేపీ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి 2014 సాధారణ ఎన్నికల్లో విజయావకాశాలను బలం చేకూర్చాయి. భారతీయ జనతా పార్టీ రాజస్తాన్‌ను గెలుచుకొని మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లను నిలబెట్టుకుంది. ఈ విజయం నరేంద్రమోడీని ప్రధాని కార్యాలయం వైపు అడుగులు వేయడానికి మార్గం సుగమమం చేస్తోందని డాన్ విశ్లేషించింది.
 
మరిన్ని వార్తలు