కల్కి భగవాన్‌పై ఈడీ కేసు!

24 Oct, 2019 14:22 IST|Sakshi

సాక్షి , చెన్నై: కల్కి ఆశ్రమాల్లో ఇటీవల జరిపిన ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ జరిపిన దాడుల్లో రూ. 20 కోట్ల విదేశీ కరెన్సీ పట్టుబడడంతో విజయకుమార్‌ నాయుడు అలియాస్‌ కల్కి భగవాన్‌పై విదేశీ మారకద్రవ్యం అభియోగంపై ఈడీ కేసులు పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. చెన్నైలో ఎల్‌ఐసీ ఏజెంట్‌గా కొన్నాళ్లు పనిచేసిన విజయ కుమార్‌ నాయుడు కల్కి భగవాన్‌ పేరున ఆధ్యాత్మిక గురువుగా అవతారమెత్తి భారీ ఎత్తున అక్రమఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఈనెల 16న ఏకకాలంలో 400 మంది ఐటీ అధికారులు మొత్తం 40 చోట్ల దాడులు చేపట్టారు. మొత్తం రూ.800 కోట్ల వరకు పన్ను ఎగవేతకు పాల్పడినట్లు కనుగొన్నారు. రూ.20 కోట్ల విదేశీ కరెన్సీ పట్టుబడింది. 

చదవండిఅజ్ఞాతం వీడిన ‘కల్కి’ వ్యవస్థాపకులు

మరిన్ని వార్తలు