చెల్లి పెళ్లి కోసం ఎంత పని చేశాడు..!

19 Sep, 2017 08:37 IST|Sakshi
చెల్లి పెళ్లి కోసం ఎంత పని చేశాడు..!

- ప్రియురాలి వద్ద రూ.10 లక్షలు కాజేసిన వైనం
- ఇంజినీర్‌ అరెస్ట్‌


టీ. నగర్‌: వివాహం చేసుకుంటానని నమ్మించి  ఓ ఇంజనీర్‌ ప్రియురాలిని మోసం చేశాడు. ఆమె దగ్గర నుంచి రూ. 10 లక్షలు తీసుకున్న ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన చెన్నైలోని ఎంజీఆర్‌. నగర్‌ పెరియార్‌ వీధిలో చోటుచేసుకుంది.   ఆ యువతి(27) కాలేజీలో చుదువుకుంటున్న సమయంలో మోహన్‌(27) తో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది.

మోహన్‌ బెంగళూరులో ఐటీ సంస్థలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అతను వివాహం చేసుకుంటానని నమ్మంచి ఆ యువతి వద్ద రూ. 10లక్షలు తీసుకున్నాడు. ఈ నగదుతో తన చెల్లెలి పెళ్లి జరిపేందుకు ఏర్పాటు చేశాడు. ఈ విషయం అతని ప్రియురాలికి తెలసింది. మొదట తన వివాహం చేసుకుందామని, ఆ తర్వాత చెల్లెలి వివాహం చేయవచ్చని ఆమె మోహన్‌కు  సూచించింది. దీనికి మోహన్‌ అంగీకరించలేదు.

అంతటితో ఆగకుండా వివాహం చేసుకోనని తేల్చి చెప్పాడు. దీంతో ఆ యువతి ఆవేదనకు గురై తన వద్ద తీసుకున్న రూ. 10 లక్షల నగదు తిరిగి ఇవ్వాలని కోరింది. అయితే మోహన్‌ అందుకు సమ్మతించక దుర్భాషలాడి బెదిరించినట్లు సమాచారం. దీనిపై ప్రియ ఫిర్యాదు మేరకు అశోక్‌నగర్‌ మహిళా ఎస్‌ఐ అముద అతడిని అరెస్టు చేశారు. అనంతరం సైదాపేట కోర్టులో హాజరుపరిచి 15 రోజుల కోర్డు కస్టడీ కింద జైలులో నిర్భందించారు.

మరిన్ని వార్తలు