నోట్ల కొరత తీర్చేందుకు ‘ఇ-పోస్’

19 Nov, 2016 16:17 IST|Sakshi
శ్రీకాకుళం: నోట్ల కొరత, విక్రయదారుల కష్టాలు తీర్చేందుకు శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం ఇ-పోస్ విధానాన్ని అమలులోకి తెచ్చింది. ఈ మేరకు జిల్లా లీడ్ బ్యాంకు అయిన ఆంధ్రా బ్యాంకు అన్ని ముందస్తు చర్యలు తీసుకుంది. చిరు వ్యాపారులకు సైతం ఇ-పోస్ మిషన్లను బ్యాంకు అధికారులు అందజేశారు. కరెంటు అకౌంట్ తెరిచి వీటిని ఉపయోగించుకోవచ్చని, స్వల్ప చార్జీలు మాత్రమే వసూలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. రెండు రూపాయలకు కొనుగోలు చేసినా కూడా దీనిద్వారా నగదు రహిత వ్యాపార లావాదేవీలు నిర్వహించుకోవచ్చన్నారు.
మరిన్ని వార్తలు