విలీనంపై కాసేపట్లో ప్రకటన

18 Aug, 2017 20:08 IST|Sakshi
విలీనంపై కాసేపట్లో ప్రకటన

చెన్నైః ఏఐడీఎంకేలో సీఎం పళనిస్వామి మాజీ సీఎం పన్నీర్‌సెల్వం గ్రూపుల విలీనంపై మరికాసేపట్లో ప్రకటన వెలువడుతుందని భావిస్తున్నారు. పన్నీర్‌సెల్వం గ్రూపు ప్రతిపాదించిన డిమాండ్లకు సీఎం పళనిస్వామి అంగీకరిచడంతో విలీనం లాంఛనం కానుంది. ఇరువురు నేతలు జయలలిత మెమోరియల్‌ను సందర్శించి అనంతరం పార్టీ కార్యాలయానికి చేరుకుంటారని సమాచారం.

జయలలిత మరణంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిన నేపథ్యంలో శుక్రవారం ఉదయం నుంచి రెండు గ్రూపుల మధ్య, వేర్వేరుగా సుదీర్ఘ మంతనాలు సాగాయి. పళనిస్వామి తన మం‍త్రివర్గ సభ్యులతో విలీనంపై చర్చించగా, పన్నీర్‌సెల్వం తన నివాసంలో సన్నిహిత నేతలతో సం‍ప్రదింపులు జరిపారు. జయలలిత మరణంపై విచారణ జరిపించడంతో పాటు పోయెస్‌ గార్డెన్స్‌ నివాసాన్ని జయ మెమోరియల్‌గా మార్చాలనే పన్నీర్‌ డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించడంతో ఇరు గ్రూపుల విలీనానికి మార్గం సుగమమైంది.

మరిన్ని వార్తలు