సహజీవనం మేలే

28 Apr, 2015 04:15 IST|Sakshi
సహజీవనం మేలే

ఎవరికీ ద్రోహం చేయకుండా సహజీవనం ఎంతో మేలని నటి తాప్సీ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ ఉత్తరాది బ్యూటీకి చాలా కాలం తర్వాత కోలీవుడ్‌లో కాంచన -2 చిత్రంతో సంతృప్తికరమైన సక్సెస్ వచ్చింది. బాలీవుడ్‌లో బేబి చిత్రం విజయం సాధించింది. రెట్టింపు సంతోషంతో ఉన్న తాప్సీతో చిన్న భేటి..
 
 ప్ర: అందాల భరిణి లాంటి మీకు కాంచన-2 చిత్రంలో దెయ్యంగా నటించడానికి ఎలా ధైర్యం వచ్చింది?
 జ: కాంచన- 2 చిత్రం కథ విన్న తర్వాత నటించాలా..? వద్ద..? అన్న నిర్ణయం తీసుకునేందుకు రెండు నెలలు పట్టింది. దెయ్యం పాత్రలో నటించేందుకు ముందు సంకోచించిన మాట వాస్తవమే. లారెన్స్ ఇది చాలా మంచి పాత్ర అని, నువ్వు తప్ప వేరొకరు న్యాయం చేయలేరని చెప్పడంతో అంగీకరించాను. ఆయన నాపై పెట్టుకున్న నమ్మకం ఫలించింది.
 
 ప్ర: మీరు నటించిన హిందీ చిత్రం బేబి, కాంచన-2 ఏక కాలంలో విడుదలై విజయం సాధించడం గురించి...?
 జ: 2014లో నేను నటించిన ఒక చిత్రం కూడా తెరపైకి రాలేదు. ఇది బాధాకర విషయం. ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలు నా కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతాయన్న నమ్మకం మాత్రం ఉండేది. ఆ నమ్మకం వమ్ము కాలేదు. రెండూ హిట్ కావడం ఆనందంగా ఉంది. కాంచన - 2 చిత్రంలో నా నటనకు పలువురి నుంచి ప్రశంసలు రావడం సంతోషంగా ఉంది.
 
 ప్ర: సినీ పరిశ్రమలో మీకు లక్ష్మి మంచు మినహా వేరే స్నేహితులు లేరట నిజమేనా..?
 జ: నిజమే. నాకు చిత్ర పరిశ్రమకు సంబంధించినంత వరకు స్నేహితురాలు అంటే లక్ష్మి మంచునే. నాకు సినిమా రంగంలో అధికంగా స్నేహితులు ఉండాలని కోరుకోవడం లేదు. అదేవిధంగా సినిమా రంగానికి, వ్యక్తిగత జీవితానికి సంబంధం ఉండకూడదన్నదే నా భావన. సినిమాకు బయట నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు.
 
 ప్ర: ఓ కదల్ కన్మణి చిత్రంలో హీరో హీరోయిన్లు సహజీవనం సాగించినట్టు చూపించారు దీన్ని సమర్థిస్తారా?
 జ: పెళ్లి కాకుండా సహజీవనం చేయడం మేలే. వివాహం చేసుకుని ఆ తర్వాత విడాకులు తీసుకుంటే పిల్లలకు సమస్యలు తప్పవు. అదే సహజీవనం చేస్తే నచ్చకుంటే విడిపోవచ్చు. తద్వారా ఎవరికీ సమస్య ఉండదు.
 
 ప్ర: ఇంటర్నెట్‌లో హీరోయిన్ల అశ్లీల దృశ్యాలు హల్‌చల్ చేస్తున్నాయి. దీనిపై మీ కామెంట్?
 జ: ఒక నటిని తప్పుగా చిత్రీకరించి సోషల్ నెట్‌వర్క్‌లో ప్రచారం చేసే వాళ్లు కచ్చితంగా బుద్ది లేని వారే. అందుకే ప్రస్తుతం సమాజంలో అత్యాచార సంస్కృతి పెరుగుతోంది. అందుకు కారణమైన వారిని అవయవాలను కత్తిరించాలి. అదే సరైన శిక్ష.
 
 ప్ర: మీపై వస్తున్న వదంతుల గురించి?
 జ: నేను జీవితంలో చాలా నేర్చుకున్నాను. ఎవర్ని నమ్మాలో, నమ్మకూడదో తెలుసుకున్నాను. నాపై జరుగుతున్నది అసత్య ప్రచారమే కాబట్టి వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
 
 ప్ర: పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు?
 జ: అందుకు చాలా సమయం ఉంది. నటించడం ఇక చాలు అనుకున్నప్పుడు పెళ్లికి సిద్ధమవుతాను. వివాహానంతరం క చ్చితంగా నటించను.
 

మరిన్ని వార్తలు