కుటుంబం ఆత్మహత్యాయత్నం

30 Jun, 2015 08:12 IST|Sakshi
కుటుంబం ఆత్మహత్యాయత్నం

- భార్య మృతి - విషమ పరిస్థితిలో భర్త
- ప్రమాదం నుంచి బయట పడిన చిన్నారులు
- సంఘటనా స్థలాన్ని పరీశీలించిన డీసీ, ఎస్‌పి.


మండ్య : పేద కుటుంబం అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు ప్రయత్నిం చింది. ఈ ఘటనలో భార్య మృతి చెం దగా, భర్త మృత్యువుతో పోరాడుతున్నారు. ఈ సంఘటన జిల్లాలోని పాండవపుర తాలూకా చినకురళి గ్రామంలో ఆదివారం వెలుగు చూసింది. పాండవపుర పోలీసులు కథనం మేరకు  చినకురళి గ్రామానికి చెందిన దినేష్(30) కూలీ. ఈయనకు భార్య శ్వేత (27), కు మార్తె స్పందన(4), మోనిక(3)ఉన్నా రు. అయితే కుటుంబ అవసరాల కోసం దినేష్ పలుచోట్ల అప్పులు చేశాడు.

రుణదాతల ఒత్తిళ్లు అధికం కావడంతో, అప్పుడు తీర్చలేక కుటుం బం మొత్తం ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం ఉదయం కాలం చెల్లిన మాత్రలు తీసుకుని నీటిలో వేసుకుని మింగారు. మొదట భర్త దినేష్, భార్య శ్వేత ఆ నీటిని తాగారు. అనంతరం పెద్ద కుమార్తె స్పందనకు ఆ నీటిని తాపిస్తుండగా చిన్నకుమార్తె భయంతో ఏడచు కుంటూ పారిపోయింది. బయటికి వెళ్లిన చిన్నారి ఏడుస్తుండగా స్థానికులు గమనించి, బాలికతోపాటు ఇంటిలోకి వచ్చారు.

అప్పటికే ఇంట్లో ముగ్గురూ కిందపడిపోయి విలవిల్లాడుతున్నారు. వెంటనే 108 వాహనానికి ఫోన్ చేసి కుటుంబం మొత్తాన్ని మైసూరు నగరంలోని కే.ఆర్.ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేయిస్తుండగా శ్వేత మృతి చెందింది. భర్త దినేష్ చావు బతుకుల మధ్యకొట్టుమిట్టాడుతున్నారు. అయితే చిన్నారికి ఎలాంటి ప్రాణ హాని లేదని డాక్టర్లు తెలిపారు. చికిత్స పొందుతున్న వారిని జిల్లా అధికారి డాక్టర్ అజయ్ నాగభూషన్, జిల్లా ఎస్పీ భూషన్ జీ బోరసే పరామర్శించారు. పాండవ పుర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు